Saturday, July 11, 2020

Velugu Needalu » Siva Govinda      వెలుగు నీడలు » శివ గోవింద

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Siva Govinda / శివ గోవింద
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Others
Siva gOviMda gOviMda hari gOviMda gOviMda 2
1. saMtAnamE lEka svargamElEdani
ciTTipApanu tecci peMcukuMTAru saMtA
saMtu kaligiMdaMTE ciTTipApAyI gati
SrImatE rAmAnujAyanamaH
2.tama bAgukOsamai taMTAlu paDalEru
eduTi koMpaku esaru peDatArayA
porugu paccanu OrvalEni vArIgati
SrImatE rAmanujAyanamaH Siva
3. orula kOsaM tyAgamonariMcu vArokaru
parula mOsaM cEsi bratuku vAriMkokaru
upakArikE kIDu talapeTTuvAri gati
SrImadraramAramaNa gOviMdO hari gOviMda gOviMda Siva
4. kalimi lEnannALLu kalisi melisuMTAru
kalimi cErinavADu kATlADukuMTAru
kalimi peMcE kAyakaShTa jIvula gati
SrImatE rAmAnujAyanamaH
5. AnADu SrI yOgi vIrabrahmaMgAru
kAlaj~jAnamu bOdha cEsErayA AnADu
InADu kosaverri veMgaLappa mATa
akSharAlA jarigi tIrEnayA Siva
 
youtu.be/64eHOt1CwPM
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద 2
1. సంతానమే లేక స్వర్గమేలేదని
చిట్టిపాపను తెచ్చి పెంచుకుంటారు సంతా
సంతు కలిగిందంటే చిట్టిపాపాయీ గతి
శ్రీమతే రామానుజాయనమః
2.తమ బాగుకోసమై తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారయా
పొరుగు పచ్చను ఓర్వలేని వారీగతి
శ్రీమతే రామనుజాయనమః శివ
3. ఒరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టువారి గతి
శ్రీమద్రరమారమణ గోవిందో హరి గోవింద గోవింద శివ
4. కలిమి లేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు
కలిమి చేరినవాడు కాట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయకష్ట జీవుల గతి
శ్రీమతే రామానుజాయనమః
5. ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు
కాలజ్ఞానము బోధ చేసేరయా ఆనాడు
ఈనాడు కొసవెర్రి వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా శివ
 
youtu.be/64eHOt1CwPM

0 comments:

Post a Comment