Friday, July 17, 2020

Velugu Needalu » Padavoyi Bharateyudaa      వెలుగు నీడలు » పాడవోయి భారతీయుడా

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Padavoyi Bharateyudaa / పాడవోయి భారతీయుడా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Rajasulochana / రాజసులోచన ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Inspiring & Motivational Songs
pADavOyi BAratIyuDA
ADipADavOyi vijayagItikA pADavOyi
nEDE svAtaMtryadinaM vIrula tyAgaPalaM
nEDE svAtaMtryadinaM vIrula tyAgaPalaM
nEDE navOdayaM nIdE AnaMdaM O^^O^^O pADavOyi
svAMtaMtryaM vaccenanI saBalE cEsi
saMbarapaDagAnE saripOdOyi
sAdhiMcina dAniki saMtRuptini poMdi
adE vijayamanukuMTE porapATOyi
AgakOyi BAratIyuDA



prati maniShi mariyokani dOcukunE vADE.
prati maniShi mariyokani dOcukunE vADE.
tana sauKyaM tana BAgyaM cUsukunE vADE
svArthamI anartha kAraNaM
adi caMpukonuTe kShEmadAyakaM
adi caMpukonuTe kShEmadAyakaM
svArthamI anartha kAraNaM
samasamAja nirmANamE nI dhyEyaM... nI dhyEyaM..
sakala janula sauBAgyamE nI lakShyaM... nI lakShyaM
samasamAja nirmANamE nI dhyEyaM...
sakala janula sauBAgyamE nI lakShyaM...
Eka dIkShatO gamyaM cErinanADE
lOkAniki mana BAratadESaM
aMdiMcunulE SuBasaMdESaM
lOkAniki mana BAratadESaM
aMdiMcunulE SuBasaMdESaM
A...hA...hA...hA....


youtu.be/JderAOj93RY
పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయగీతికా పాడవోయి
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓఓఓ పాడవోయి
స్వాంతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా



ప్రతి మనిషి మరియొకని దోచుకునే వాడే.
ప్రతి మనిషి మరియొకని దోచుకునే వాడే.
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే
స్వార్థమీ అనర్థ కారణం
అది చంపుకొనుటె క్షేమదాయకం
అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్థమీ అనర్థ కారణం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం... నీ ధ్యేయం..
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం... నీ లక్ష్యం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం...
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం...
ఏక దీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
ఆ...హా...హా...హా....
 
youtu.be/JderAOj93RY

0 comments:

Post a Comment