Song » Kalakaanidi / కలకానిది
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Sad & Patho songs
kalakAnidi viluvainadi bratuku kannITi dhAralalOnE kala balicEyaku gAlivIci pUvula tIga nElavAlipOgA jAli vIDi aTulE dAni vadilivaituvA.... O...O....O cEradIsi nIru pOsi ciguriMcanIyavA kala alumukunna cIkaTilOnE alamaTiMcanElA alama kalatalakE loMgipOyi kaluvariMcanElA ...O...O...O sAhasamanu jyOtini cEkoni sAgipO kala agAdhamau jalanidhilOna ANimutyamunnaTulE SOkAla maruguna dAgi suKamunnadilE Edi tanaMta tAnai nI dariki rAdu SOdhiMci sAgiMcAli adiyE dhIraguNaM kala youtu.be/kIEz9AtpqwI
కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే కల బలిచేయకు గాలివీచి పూవుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాని వదిలివైతువా.... ఓ...ఓ....ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కల అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా అలమ కలతలకే లొంగిపోయి కలువరించనేలా ...ఓ...ఓ...ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కల అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాగించాలి అదియే ధీరగుణం కల youtu.be/kIEz9AtpqwI
0 comments:
Post a Comment