Tuesday, July 7, 2020

Veerabhimanyu » Challani swamivi neevaitae వీరాభిమన్యు » చల్లని సామివి నీవైతే

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Challani swamivi neevaitae / చల్లని సామివి నీవైతే
Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Kanchana / కాంచన  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
callani sAmivi nIvaitE .. allana Agumu jAbillI

    edalO karuNE nIkuMTE .. udayaM kAnIkOyI

    callani sAmivi nIvaitE .. allana Agumu jAbillI

    edalO karuNE nIkuMTE .. udayaM kAnIkOyI



    callani sAmivi nIvaitE .. allana Agumu jAbillI



caraNaM 1:

    mukkuna mukkera aMdaM kAnI muccaTakadi pratibaMdhaM

    mukkuna mukkera aMdaM kAnI muccaTakadi pratibaMdhaM

    mana AnaMdAniki aDDayyE E aMdamainA eMdulakU? aMdamainA eMdulaku?..U...



    rasamaya hRudayaM nIdaitE ratirAjA kanumUyakumu

    mA praNayaM paccaga uMDE varaku raNaBErI mrOgakumU !



caraNaM 2:

    gAjulu cEtiki soMpu.. praNayAniki avi saDaliMpu

    gAjulu cEtiki soMpu.. praNayAniki avi saDaliMpu

    mana anubaMdhAniki aDDayyE I ABaraNAlu eMdulaku? ABaraNAlu eMdulaku?



    tIrani kOrika nIdaitE tArA caMdruni taramakumu

    I tIyani vennela dOcuku pOyE dinarAjunu rAnIyakumU !



caraNaM 3:



    padamula kaMdamu aMdiyalU avi palumaru cEyunu saMdaDulu

    padamula kaMdamu aMdiyalU avi palumaru cEyunu saMdaDulu

    talapulu paMDE taruNaMlO I savvaDulannI eMdulaku?... savvaDulannI eMdulaku?



    callani sAmivi nIvaitE .. allana Agumu jAbillI

    edalO karuNE nIkuMTE .. udayaM kAnIkOyI




Click here to hear the song
పల్లవి:

    చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ

    ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ

    చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ

    ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ



    చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ



చరణం 1:

    ముక్కున ముక్కెర అందం కానీ ముచ్చటకది ప్రతిబంధం

    ముక్కున ముక్కెర అందం కానీ ముచ్చటకది ప్రతిబంధం

    మన ఆనందానికి అడ్డయ్యే ఏ అందమైనా ఎందులకూ? అందమైనా ఎందులకు?..ఊ...



    రసమయ హృదయం నీదైతే రతిరాజా కనుమూయకుము

    మా ప్రణయం పచ్చగ ఉండే వరకు రణభేరీ మ్రోగకుమూ !



చరణం 2:

    గాజులు చేతికి సొంపు.. ప్రణయానికి అవి సడలింపు

    గాజులు చేతికి సొంపు.. ప్రణయానికి అవి సడలింపు

    మన అనుబంధానికి అడ్డయ్యే ఈ ఆభరణాలు ఎందులకు? ఆభరణాలు ఎందులకు?



    తీరని కోరిక నీదైతే తారా చంద్రుని తరమకుము

    ఈ తీయని వెన్నెల దోచుకు పోయే దినరాజును రానీయకుమూ !



చరణం 3:

    పదముల కందము అందియలూ అవి పలుమరు చేయును సందడులు

    పదముల కందము అందియలూ అవి పలుమరు చేయును సందడులు

    తలపులు పండే తరుణంలో ఈ సవ్వడులన్నీ ఎందులకు?... సవ్వడులన్నీ ఎందులకు?



    చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ

    ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment