Monday, July 20, 2020

Vasu » Nammave ammayei      వాసు » నమ్మవే అమ్మాయి

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nammave ammayei / నమ్మవే అమ్మాయి

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Raghavendra / రాఘవేంద్ర ,Song Category : Others
pa/a: nammavE ammAyi tariMcipOyE cEyi
ilAMTi hAyimodaTisAri  soMtamayi (2)
hAyi migilipOyimanassu jAripOyi
ninnodilirAnu aMdi nannu maracipOyi
dEhamaMta mAripOyE cEyigA
kAlamaMta kAlutOMdi tIyagA
mAyamaina A kShaNAnni vetukutOMdi cilipigAnu    || nammavE||
ca/A: O sAri ceyyEstE ilA kaLLumUsi oLLu maracipOtE
a:nuvE ganuka nEnayitE nuvvE ceppagalavu Emi jariganaMTE
A: ilAga vElutAki alAga sOlipOtE
nuvvEmiTauduvO mariMta muMdukostE
a; tuPAnu kAkamuMdu ciTukku cinuku muddu
ilAge mana guMDellOna Avirlu rEpi pOdA
a: nammavE ammAyi
A: cAlulE baDAyi kavitvamA abbAyi
kaburlatOnE kAlamaMtA gaDapakOyi
imtakannA hAyi kAvAlA AkatAyi
aMdiMcagalanu cEtilOna cEyi
ca: innALlu I gAli ilA pADalEdu iMtacilipi lAli
A: iMkEmi kAvAli sarE veLLu kalalalOki tEli tEli
a: ivALa nuMci nEnu pUlaina muTTukOnu
nI lEta cEti sparSa kaMdipOvunEmO
A: maraite iMka nEnu elAga taTTukOnu
nI varasa cUstE iMka nuvu nannaina tAkavEmO....
cAlulE baDAyi                              a: ||nammavE||
 
 
Click here to hear the song
ప/అ: నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయిమొదటిసారి  సొంతమయి (2)
హాయి మిగిలిపోయిమనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగాను    || నమ్మవే||
చ/ఆ: ఓ సారి చెయ్యేస్తే ఇలా కళ్ళుమూసి ఒళ్ళు మరచిపోతే
అ:నువే గనుక నేనయితే నువ్వే చెప్పగలవు ఏమి జరిగనంటే
ఆ: ఇలాగ వేలుతాకి అలాగ సోలిపోతే
నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే
అ; తుఫాను కాకముందు చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగె మన గుండెల్లోన ఆవిర్లు రేపి పోదా
అ: నమ్మవే అమ్మాయి
ఆ: చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇమ్తకన్నా హాయి కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోన చేయి
చ: ఇన్నాళ్లు ఈ గాలి ఇలా పాడలేదు ఇంతచిలిపి లాలి
ఆ: ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి
అ: ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో
ఆ: మరైతె ఇంక నేను ఎలాగ తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువు నన్నైన తాకవేమో....
చాలులే బడాయి                              అ: ||నమ్మవే||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment