Monday, July 13, 2020

Uttama Villan » Thandhanatthom      ఉత్తమ విలన్ » తందనత్తోం

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Thandhanatthom / తందనత్తోం
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Gibran / జిబ్రాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Kamal Haasan / కమల్ హాసన్ ,Song Category : Inspiring & Motivational Songs
taMdanattOM nIku aMkitaM I villu pATa 
(AhA I villu pATa) aMdukOve kaLAmatallI
tAnataMdAnaMTU EDu svarAlaku rAgaM kaTTi (svarAlaku rAgaM kaTTi)
DOlu paMba urumi Dappu vAdyAlu koTTi 
(Dappu vAdyAlu koTTi) vaiBavAla mELaM tOTi
GallaMTU gajje kaTTi raMgAniki daNNaM peTTi 
(raMgAniki daNNaM peTTi)
arjunuDu pASupatAstraM poMdina katha 
(AhA poMdina katha) adButaMgA ADabOtunnAM
paina niMgi kiMda BUmi madhyalO villaMbu vIruDu 
(madhyalO villaMbu vIruDu)
avatAramette sAmi lOkAlu meccE
(AhA lOkAlu meccE) upakAri brahmaj~jAni
tattOM tattOM tarikiTa tattOM tattOM tarikiTa



karuNagala dEvuDani nammadagu vidhamai paraSivuni kAMcinADE
tanuvu aNuvaNuvunoka Siva caraNa biMduvuga nilupu vara dIkShayataDE
Adi Siva pArvatulu dayaganina tapamai
arjunuDi magasiriki tagina pratiPalamai
pASupatAstraM Baktuniki dattaM
satyamagu vijayaM saPalamI samayaM SivamE Bavamu



SaMkaru karuNai poMgenu maMgaLa gaMgOttuMga Jari
Siva Siva SiSa Siva SaMkara mahimA lIlA lAsyamidi
saMbaramoMdi naTanamunADenu himagiri naTarAju
A mAdEvuni aDugai kalisenu arjuna maharAju
okaTE kAluga tUgenu lOkaM reMDU nilavaka tUlina maikaM
Sirasuna gaMga karamuna Damaru sagamuna Sakti karuNAmUrti
SaMkara SaMkara SaMkara SaMkara SaMkara SaMkara SaMkara
తందనత్తోం నీకు అంకితం ఈ విల్లు పాట 
(ఆహా ఈ విల్లు పాట) అందుకోవె కళామతల్లీ
తానతందానంటూ ఏడు స్వరాలకు రాగం కట్టి (స్వరాలకు రాగం కట్టి)
డోలు పంబ ఉరుమి డప్పు వాద్యాలు కొట్టి 
(డప్పు వాద్యాలు కొట్టి) వైభవాల మేళం తోటి
ఘల్లంటూ గజ్జె కట్టి రంగానికి దణ్ణం పెట్టి 
(రంగానికి దణ్ణం పెట్టి)
అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన కథ 
(ఆహా పొందిన కథ) అద్భుతంగా ఆడబోతున్నాం
పైన నింగి కింద భూమి మధ్యలో విల్లంబు వీరుడు 
(మధ్యలో విల్లంబు వీరుడు)
అవతారమెత్తె సామి లోకాలు మెచ్చే
(ఆహా లోకాలు మెచ్చే) ఉపకారి బ్రహ్మజ్ఞాని
తత్తోం తత్తోం తరికిట తత్తోం తత్తోం తరికిట



కరుణగల దేవుడని నమ్మదగు విధమై పరశివుని కాంచినాడే
తనువు అణువణువునొక శివ చరణ బిందువుగ నిలుపు వర దీక్షయతడే
ఆది శివ పార్వతులు దయగనిన తపమై
అర్జునుడి మగసిరికి తగిన ప్రతిఫలమై
పాశుపతాస్త్రం భక్తునికి దత్తం
సత్యమగు విజయం సఫలమీ సమయం శివమే భవము



శంకరు కరుణై పొంగెను మంగళ గంగోత్తుంగ ఝరి
శివ శివ శిశ శివ శంకర మహిమా లీలా లాస్యమిది
సంబరమొంది నటనమునాడెను హిమగిరి నటరాజు
ఆ మాదేవుని అడుగై కలిసెను అర్జున మహరాజు
ఒకటే కాలుగ తూగెను లోకం రెండూ నిలవక తూలిన మైకం
శిరసున గంగ కరమున డమరు సగమున శక్తి కరుణామూర్తి
శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర

0 comments:

Post a Comment