Sunday, July 12, 2020

Uttama Villan » Srushiti Niyamam      ఉత్తమ విలన్ » సృష్టి నియమం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Srushiti Niyamam / సృష్టి నియమం
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Gibran / జిబ్రాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Kamal Haasan / కమల్ హాసన్ ,Song Category : Inspiring & Motivational Songs
sRuShTi niyamaM evvarikainA 
KAyaM maraNaM (KAyaM maraNaM)
gAliki ArE dIpaM lAgA 
mAyaM prANaM (mAyaM prANaM)
gagana gaNitapu lekka prakAraM lOkamidi
oka maTTi baMti (maTTi baMti O...maTTi baMti..O)
maTTi baMtini cuTTi tirigE
pratokka baMti aMtamai pOdA (aMtamai pOdA O..aMtamai pOdA...O)
mahA sUryuni tEjamu kUDA 
marO yugamuna BasmaM kAdA (Basmamu kAdA)
karigi marigE vilayamaMdu 
uDuku dravamuna ciguru molucu
perigi puDamini orugu vRukShaM 
tana maraNaM tOnE nATunu vittanaM (aMtamE AraMBaM O aMtamE AraMBaM)
vIluMTE ninnu pOlina jIviki 
usirunosaguTe kartavyamanukO (kartavyamanukO)
nI vaMtu vidhigA vaMSadhAra vyApti ceMdeDi varamu kAgA
rAsipeTTina kanniya kAvale (kanniya kAvale rAsipeTTina kanniya kAvale)
kOrinavannI aMdina Ganulu cAvunu kOrI caccina kathalu
vElaku vElu vElaku vElu O vElaku vElu
సృష్టి నియమం ఎవ్వరికైనా 
ఖాయం మరణం (ఖాయం మరణం)
గాలికి ఆరే దీపం లాగా 
మాయం ప్రాణం (మాయం ప్రాణం)
గగన గణితపు లెక్క ప్రకారం
లోకమిది ఒక మట్టి బంతి (మట్టి బంతి ఓ...మట్టి బంతి..ఓ)
మట్టి బంతిని చుట్టి తిరిగే
ప్రతొక్క బంతి అంతమై పోదా (అంతమై పోదా ఓ..అంతమై పోదా...ఓ)



మహా సూర్యుని తేజము కూడా 
మరో యుగమున భస్మం కాదా (భస్మము కాదా)
కరిగి మరిగే విలయమందు 
ఉడుకు ద్రవమున చిగురు మొలుచు
పెరిగి పుడమిని ఒరుగు వృక్షం 
తన మరణం తోనే నాటును విత్తనం
(అంతమే ఆరంభం ఓ అంతమే ఆరంభం)



వీలుంటే నిన్ను పోలిన జీవికి 
ఉసిరునొసగుటె కర్తవ్యమనుకో (నీ వంతు కర్తవ్యమనుకో)
నీ వంతు విధిగా వంశధార వ్యాప్తి చెందెడి వరము కాగా
రాసిపెట్టిన కన్నియ కావలె 
(కన్నియ కావలె రాసిపెట్టిన కన్నియ కావలె)
కోరినవన్నీ అందిన ఘనులు చావును కోరీ చచ్చిన కథలు
వేలకు వేలు వేలకు వేలు ఓ వేలకు వేలు

0 comments:

Post a Comment