Tuesday, July 7, 2020

Toorupu velle railu » Sandepoddu తూర్పు వెళ్ళే రైలు » సందెపొద్దు

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Sandepoddu / సందెపొద్దు
Song Details:Actor : Mohan / మోహన్ ,Actress : Jyothi / జ్యోతి ,Music Director : S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    saMdepoddu aMdAlunna cinnadI

    ETi nITa tAnAlADutu unnadI

    saMdepoddu aMdAlunna cinnadI

    ETi nITa tAnAlADutu unnadI

    bommalA muddugummalA

    puvvulA pAlanavvulA

    meruputIgamallE taLukumaMTE

    I addAla oLLaMtA muddADukOnA

    saMdepoddu aMdAlunna cinnadI

    ETi nITa tAnAlADutu unnadI



caraNaM 1:

    AkatAyi bullODallE allareDitE

    rAlugAyi rAgAlanni raccabeDitE

    evvaraina cUsAraMTE allaraipOtAnayyO

    ennelaMTi batukaMtA cIkaTaipOtAdayyO

    dIpamallE nEnuMTAnu tIpi rEpu testuMTAnu

    dIpamallE nEnuMTAnu tIpi rEpu testuMTAnu

    kaluvapuvvu nIvai velugu nEnai elatETi pATallE celarEgipOnA



caraNaM 2:

    muttemaMTi oLLu taDisi muddu puDitE

    guMDelOna eMDakAsi ArabeDitE

    ASalAripOkuMDA UsulADukOvAli

    UsuleMDipOkuMDA UTa kOrkeluMDAli

    guvvalATi jODuMDAli yavvanAla gUDeyyAli

    guvvalATi jODuMDAli yavvanAla gUDeyyAli

    ninnu nannu cUsi diShTi tIsi A lOkAla dEvuLLE dIviMcipOvAli


 


Click here to hear the song
పల్లవి:

    సందెపొద్దు అందాలున్న చిన్నదీ

    ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

    సందెపొద్దు అందాలున్న చిన్నదీ

    ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

    బొమ్మలా ముద్దుగుమ్మలా

    పువ్వులా పాలనవ్వులా

    మెరుపుతీగమల్లే తళుకుమంటే

    ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

    సందెపొద్దు అందాలున్న చిన్నదీ

    ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ



చరణం 1:

    ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే

    రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే

    ఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యో

    ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో

    దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను

    దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను

    కలువపువ్వు నీవై వెలుగు నేనై ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా



చరణం 2:

    ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే

    గుండెలోన ఎండకాసి ఆరబెడితే

    ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి

    ఊసులెండిపోకుండా ఊట కోర్కెలుండాలి

    గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి

    గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి

    నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment