
Song » Ne Kallatoti / నీ కళ్ళతోటి
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Nayantara / నయన తార ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Chitra / చిత్ర ,
Sagar / సాగర్ ,Song Category : Others
nI kaLLatOTi nA kaLLalOki cUstEne caMdrOdayaM nI cUputOTi nanu tAkuMTE tanuvaMta sUryOdayaM ilAgE ilAgE manaM EkamayyE..kShaNAlE kadA O varaM alAgE alAgE prapaMcAlu palikE kadhavvAli manamiddaraM nI kaLLatOTi nA kaLLalOki cUstEne caMdrOdayaM nI cUputOTi nanu tAkuMTE tanuvaMta sUryOdayaM aDugunautAnu..nI veMTa nEnU..tODugA naDavagA civari dAkA goDugunautAnu..ikapaina nEnU..bAdhalO ninnilA taDavanIkA ninnodili kShaNamaina asaluMDalEnu..cirunavvunautAnu pedavaMcunA.. nI lEta cekkiLLa vAkiLLalOnE..tolisiggu nEnavvanA ! nI kaLLatOTi nA kaLLalOki cUstEne caMdrOdayaM nI cUputOTi nanu tAkuMTE tanuvaMta sUryOdayaM hA..vennelautAnu..prati rEyi nEnu..cIkaTE nI dariki cErakuMDA UpirautAnu..nIlOna nEnu..ennaDU nI jatE vadalakuMDA nA rANi pAdAlu muddADukuMTU..nEnuMDipOtAnu pArANilA cirucemaTa paDutuMTE nI nuduTipainA..vastAnu cirugAlilA ! Click here to hear the song
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే..క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం అడుగునౌతాను..నీ వెంట నేనూ..తోడుగా నడవగా చివరి దాకా గొడుగునౌతాను..ఇకపైన నేనూ..బాధలో నిన్నిలా తడవనీకా నిన్నొదిలి క్షణమైన అసలుండలేను..చిరునవ్వునౌతాను పెదవంచునా.. నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే..తొలిసిగ్గు నేనవ్వనా ! నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం హా..వెన్నెలౌతాను..ప్రతి రేయి నేను..చీకటే నీ దరికి చేరకుండా ఊపిరౌతాను..నీలోన నేను..ఎన్నడూ నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ..నేనుండిపోతాను పారాణిలా చిరుచెమట పడుతుంటే నీ నుదుటిపైనా..వస్తాను చిరుగాలిలా ! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment