Friday, July 24, 2020

Thoorpu Padamara » Thoorpu Padamara      తూర్పు పడమర » తూర్పు పడమర

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Thoorpu Padamara / తూర్పు పడమర

Song Details:Actor : Narasimha Raju / నరసింహ రాజు ,Actress : Srividya / శ్రీ విద్య ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

tUrpu paDamara eduredurU

niMgI nElA eduredurU

kaliyani dikkulu kalavavanI

telisi ArATaM dEnikanI

I praSnaku badulEdi?

I sRuShTiki modalEdI?       2
caraNaM:

tUrpuna udayiMcE sUryuDu

paDamara niduriMcunu

paDamaTa niduriMcE sUryuDE tUrpuna udayiMcunu.

A tUrpu paDamarakEmaunu?

I paDamara tUrpukEmaunu?

I praSnaku badulEdi?

I sRuShTiki modalEdI?  tUrpu
caraNaM:

niMgini sAgE nIlimEGaM nEla oDilO varShiMcunu

nElanu kurisE A nIrE niMgilO mEGamai payaniMcunu.

I niMgiki nEla Emaunu?

I nElaku niMgi Emaunu?

I praSnaku badulEdi?

I sRuShTiki modalEdi?      tUrpu
caraNaM :

vEyani nATakaraMgaMpaipa

vrAyani nATaka mADutunnAmu

sUtradhAriki pAtradhArulaku

tEDA teliyaka tirugutunnAmu.
nATakamE oka jIvitamA?

jIvitamE oka nATakamA?

I praSnaku badulEdi?

I sRuShTiki modalEdi? 
jIvitamE oka nATakamayitE

nATakamE oka jIvitamayitE

pAtralu ekkaDa tiriginA sUtradhAri eTu tippinA

katha mugisE lOgA kalavakuMdurA

A sUtradhAri tAnE kalavakuMDunA!
vinnavA! idi vinnAvA sUryuDA, udayasUryuDA!

paDamaTi dikkuna udayiMcAlani BrAMti eMdukO?

sRuShTiki pratisRuShTi cEsE dIShTi mAnukO

ninnu ASagA cUsE kanulaku

kannIrE migiliMcaku - iMkA iMkA ragiliMcaku

caMdruni caluvanu paMcukO

ninnaTi ASalu teMcukO   tUrpu
caraNaM:

 kOTi vINiyalu guMDe aMculanu

mITi nAvA dEvA?

koMDaviDici A kOna viDici

kai daMDa nosagi kApADavA

ika ADalEnu I nATakaM - alasipOye nA jIvitaM

rAvayyA! digirAvayyA

idE idE nA maMgaLagItaM

oka sumaMgaLI gItaM
పల్లవి:

తూర్పు పడమర ఎదురెదురూ

నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ

తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ సృష్టికి మొదలేదీ?       2
చరణం:

తూర్పున ఉదయించే సూర్యుడు

పడమర నిదురించును

పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించును.

ఆ తూర్పు పడమరకేమౌను?

ఈ పడమర తూర్పుకేమౌను?

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ సృష్టికి మొదలేదీ?  తూర్పు
చరణం:

నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించును

నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించును.

ఈ నింగికి నేల ఏమౌను?

ఈ నేలకు నింగి ఏమౌను?

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ సృష్టికి మొదలేది?      తూర్పు
చరణం :

వేయని నాటకరంగంపైప

వ్రాయని నాటక మాడుతున్నాము

సూత్రధారికి పాత్రధారులకు

తేడా తెలియక తిరుగుతున్నాము.
నాటకమే ఒక జీవితమా?

జీవితమే ఒక నాటకమా?

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ సృష్టికి మొదలేది? 
జీవితమే ఒక నాటకమయితే

నాటకమే ఒక జీవితమయితే

పాత్రలు ఎక్కడ తిరిగినా సూత్రధారి ఎటు తిప్పినా

కథ ముగిసే లోగా కలవకుందురా

ఆ సూత్రధారి తానే కలవకుండునా!
విన్నవా! ఇది విన్నావా సూర్యుడా, ఉదయసూర్యుడా!

పడమటి దిక్కున ఉదయించాలని భ్రాంతి ఎందుకో?

సృష్టికి ప్రతిసృష్టి చేసే దీష్టి మానుకో

నిన్ను ఆశగా చూసే కనులకు

కన్నీరే మిగిలించకు - ఇంకా ఇంకా రగిలించకు

చంద్రుని చలువను పంచుకో

నిన్నటి ఆశలు తెంచుకో   తూర్పు
చరణం:

 కోటి వీణియలు గుండె అంచులను

మీటి నావా దేవా?

కొండవిడిచి ఆ కోన విడిచి

కై దండ నొసగి కాపాడవా

ఇక ఆడలేను ఈ నాటకం - అలసిపోయె నా జీవితం

రావయ్యా! దిగిరావయ్యా

ఇదే ఇదే నా మంగళగీతం

ఒక సుమంగళీ గీతం

0 comments:

Post a Comment