Friday, July 24, 2020

Thoorpu Padamara » Swaramulu Edainaa      తూర్పు పడమర » స్వరములు ఏడైనా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Swaramulu Edainaa / స్వరములు ఏడైనా

Song Details:Actor : Narasimha Raju / నరసింహ రాజు ,Actress : Srividya / శ్రీ విద్య ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

svaramulu EDainA rAgAlennO

svaramulu EDainA rAgAlennO

hRudayaM okaTainA BAvAlennO

svaramulu EDainA rAgAlennO    2
caraNaM:

aDugulu reMDainA nATyAlennO    2

akSharAlu konnainA kAvyAlennennO   svaramulu
caraNaM:

jananaMlOna kaladu vEdana

maraNaMlOnu kaladu vEdana         2

AvEdanalOnE udayiMcE 

navavEdAlennO, nAdAlennennO, nAdAlennennO   svaramulu
caraNaM:

nETiki rEpoka tIrani praSna

rEpaTiki marunADoka praSna

kAlamanE gAlAniki cikki                2

tElani praSnalu ennennO, ennennO  svaramulu
caraNaM:

kanulunnaMduku kalalu tappavu

kalalunnapuDu pIDakalalu tappavu  2

kalala velugulO kannIrolikE

kalatalu nIDalu ennennO, ennennO  svaramulu
పల్లవి:

స్వరములు ఏడైనా రాగాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో

హృదయం ఒకటైనా భావాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో    2
చరణం:

అడుగులు రెండైనా నాట్యాలెన్నో    2

అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో   స్వరములు
చరణం:

జననంలోన కలదు వేదన

మరణంలోను కలదు వేదన         2

ఆవేదనలోనే ఉదయించే 

నవవేదాలెన్నో, నాదాలెన్నెన్నో, నాదాలెన్నెన్నో   స్వరములు
చరణం:

నేటికి రేపొక తీరని ప్రశ్న

రేపటికి మరునాడొక ప్రశ్న

కాలమనే గాలానికి చిక్కి                2

తేలని ప్రశ్నలు ఎన్నెన్నో, ఎన్నెన్నో  స్వరములు
చరణం:

కనులున్నందుకు కలలు తప్పవు

కలలున్నపుడు పీడకలలు తప్పవు  2

కలల వెలుగులో కన్నీరొలికే

కలతలు నీడలు ఎన్నెన్నో, ఎన్నెన్నో  స్వరములు

0 comments:

Post a Comment