Friday, July 24, 2020

Thoorpu Padamara » Shivaranjani      తూర్పు పడమర » శివరంజని

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Shivaranjani / శివరంజని

Song Details:Actor : Narasimha Raju / నరసింహ రాజు ,Actress : Srividya / శ్రీ విద్య ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
shivaraMjani..navaraagini..
vininaMtanE naa tanuvulOni..
aNuvaNuvu karigiMcE amRutavaahini!!



A A A
shivaraMjani..navaraagini..A A A 



raagaala sigalOna sirimallivi..
saMgIta gaganaana jaabillivi!!
raagaala sigalOna sirimallivi..
saMgIta gaganaana jaabillivi!!



swarasura JarI taraMgaanivi..
swarasura JarI taraMgaanivi..
sarasahRudaya vINaa.. vaaNivI!!



shivaraMjani..navaraagini..A A A 



aa kanulu.. paMDu vennela ganulu..
aa kurulu.. iMdranIlaala vanulu!!
aa kanulu.. paMDu vennela ganulu..
aa kurulu.. iMdranIlaala vanulu!!



aa vadanaM aruNOdaya kamalaM..
aa adharaM sumadhura madhukalashaM!!



shivaraMjani..navaraagini..A A A 



janakuni koluvuna allanasaagE jaganmOhini jaanaki..
vENudharuni radhamaarOhiMcina viduShImaNi rukmiNi..
raashIkRuta navarasamaya jIvana raagacaMdrikaa..
lalita laavaNya bhayada sauMdarya kalita caMDikaa..



raavE..raavE naa shivaraMjani..manOraMjanI..
raMjanI..naa raMjanI..



nIvE nIvE naalO palikE naadaanivI..
nIvE naadaanivI..
naa daanivi..nIvE naadaanivI!!
 
Click here to hear the song
శివరంజని..నవరాగిని..
వినినంతనే నా తనువులోని..
అణువణువు కరిగించే అమృతవాహిని!!



ఆ ఆ ఆ
శివరంజని..నవరాగిని..ఆ ఆ ఆ 



రాగాల సిగలోన సిరిమల్లివి..
సంగీత గగనాన జాబిల్లివి!!
రాగాల సిగలోన సిరిమల్లివి..
సంగీత గగనాన జాబిల్లివి!!



స్వరసుర ఝరీ తరంగానివి..
స్వరసుర ఝరీ తరంగానివి..
సరసహృదయ వీణా.. వాణివీ!!



శివరంజని..నవరాగిని..ఆ ఆ ఆ 



ఆ కనులు.. పండు వెన్నెల గనులు..
ఆ కురులు.. ఇంద్రనీలాల వనులు!!
ఆ కనులు.. పండు వెన్నెల గనులు..
ఆ కురులు.. ఇంద్రనీలాల వనులు!!



ఆ వదనం అరుణోదయ కమలం..
ఆ అధరం సుమధుర మధుకలశం!!



శివరంజని..నవరాగిని..ఆ ఆ ఆ 



జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి..
వేణుధరుని రధమారోహించిన విదుషీమణి రుక్మిణి..
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా..
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా..



రావే..రావే నా శివరంజని..మనోరంజనీ..
రంజనీ..నా రంజనీ..



నీవే నీవే నాలో పలికే నాదానివీ..
నీవే నాదానివీ..
నా దానివి..నీవే నాదానివీ!!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment