Song » Gagananiki Udayam / గగనానికి ఉదయం
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Keerthi Reddy / కీర్తి రెడ్డి ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: gaganAniki udayaM okaTE keraTAlaki saMdraM okaTE jagamaMtaTA praNayaM okaTE okaTE praNayAniki nilayaM manamai yugayugamula payanaM manamai prati janmalO kaliSAM manamE manamE janmiMcalEdA nIvu nA kOsamE gurtiMcalEdA nannu nA prANamE prEma.. prEma.. prEma.. prEma.. gaganAniki udayaM okaTE keraTAlaki saMdraM okaTE jagamaMtaTA praNayaM okaTE okaTE caraNaM 1: nI kannullO kalanu aDugu itaDu evarani nI guMDellO tirigE layanE badulu palakanI niduriMcu yavvanaMlO poddupoDupai kadiliMcalEdA nEnE mElukolupai gatajanma j~jApakAnnai ninnu piluva karagAla maMcuporalO uMDagalanA gaganAniki udayaM okaTE keraTAlaki saMdraM okaTE jagamaMtaTA praNayaM okaTE okaTE caraNaM 2: nA UhallO kadilE kaLalE eduTapaDinavi nA UpirlO egasE segalE kuduTapaDinavi samayAnni SASvataMgA nilicipOnI mamatanna amRutaMlO munigipOnI manavaina I kShaNAlE akSharAlai mRuti lEni prEma kathagA migilipOnI gaganAniki udayaM okaTE keraTAlaki saMdraM okaTE jagamaMtaTA praNayaM okaTE okaTE praNayAniki nilayaM manamai yugayugamula payanaM manamai prati janmalO kaliSAM manamE manamE janmiMcalEdA nIvu nA kOsamE gurtiMcalEdA nannu nA prANamE prEma.. prEma.. prEma.. prEma..
పల్లవి: గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే చరణం 1: నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువ కరగాల మంచుపొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే చరణం 2: నా ఊహల్లో కదిలే కళలే ఎదుటపడినవి నా ఊపిర్లో ఎగసే సెగలే కుదుటపడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
0 comments:
Post a Comment