Sunday, July 19, 2020

Tholi Prema » E Manase se se      తొలిప్రేమ » ఈ మనసే సే సే

July 19, 2020 Posted by Publisher , No comments

Song » E Manase se se / ఈ మనసే సే సే

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Keerthi Reddy / కీర్తి రెడ్డి  ,Music Director : Deva / దేవా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    I manasE sE sE sE sE sE sE sE

    nA manasE sE sE sE sE sE sE sE

    parugeDutOMdi nIkEsE vinamaMTOMdi tana UsE

    alalegasE kalavaramAyE tanalO ninu cUsE

    I manasE sE sE sE sE sE sE sE

    nA manasE sE sE sE sE sE sE sE



caraNaM 1:

    ennO kalalanu cUsE kannE kunukodilEsE

    nuvvE nanu vetikE A tolivelugani telisE (2)

    kOrukunna tIrAnnE tAnu cErinA

    tIripOni ArATaMtO kalavariMcenA

    venakane tirugutu celi jata viDuvadu

    dorikina varamutO kudurugA niluvadu

    EMcEstE bAvuMTuMdO ceppani viMta nasE

    I manasE sE sE sE sE sE sE sE

    nA manasE sE sE sE sE sE sE sE



caraNaM 2:

    nItO celimini cEsE nIlO caluvanu cUsE

    ayinA iMkA EdO aDigE atyASE (2)

    velluvaMTi nI snEhaM nannu allinA

    vennelaMTi nI navvullO cemmagillinA

    tahataha taragadu alajaDi aNagadu

    tana soda idi ani talapunu telupadu

    EmistE SAMtistuMdO telusA E varasE

    I manasE sE sE sE sE sE sE sE

    nA manasE sE sE sE sE sE sE sE

    parugeDutOMdi nIkEsE vinamaMTOMdi tana UsE

    alalegasE kalavaramAyE tanalO ninu cUsE

    I manasE sE sE sE sE sE sE sE

    nA manasE sE sE sE sE sE sE sE
పల్లవి:

    ఈ మనసే సే సే సే సే సే సే సే

    నా మనసే సే సే సే సే సే సే సే

    పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే

    అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే

    ఈ మనసే సే సే సే సే సే సే సే

    నా మనసే సే సే సే సే సే సే సే



చరణం 1:

    ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే

    నువ్వే నను వెతికే ఆ తొలివెలుగని తెలిసే (2)

    కోరుకున్న తీరాన్నే తాను చేరినా

    తీరిపోని ఆరాటంతో కలవరించెనా

    వెనకనె తిరుగుతు చెలి జత విడువదు

    దొరికిన వరముతో కుదురుగా నిలువదు

    ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే

    ఈ మనసే సే సే సే సే సే సే సే

    నా మనసే సే సే సే సే సే సే సే



చరణం 2:

    నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే

    అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే (2)

    వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా

    వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా

    తహతహ తరగదు అలజడి అణగదు

    తన సొద ఇది అని తలపును తెలుపదు

    ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే

    ఈ మనసే సే సే సే సే సే సే సే

    నా మనసే సే సే సే సే సే సే సే

    పరుగెడుతోంది నీకే వినమంటోంది తన ఊసే

    అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే

    ఈ మనసే సే సే సే సే సే సే సే

    నా మనసే సే సే సే సే సే సే సే

0 comments:

Post a Comment