Saturday, July 11, 2020

Thodikodallu » Town Pakkakelladdura      తోడికోడళ్ళు » టౌను పక్కకెల్లొద్దురా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Town Pakkakelladdura / టౌను పక్కకెల్లొద్దురా
Song Details:Actor :Actress :Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
ataDu : tiMTAnikkUDu cAladE, jAMgirI uMTAnikillu cAladE
bastIki pOdAM paisA teddAmE rAvEnA raMgasAnI!!
Ame : Taunu pakkakelloddurA DiMgarI! DAMbikAlu pOvoddurA
Taunu pakkeLLEvu DaunaipOtAvurA rabbI baMgAru sAmi!
ataDu : rekkalannI irusukuMTa rikShAlu lAkkuMTa
cillaraMta jErcukuMTa sinimAlu cUsukuMTa
ShikArlu koDadAmE - pillA jalasA cEddAmE bastIki
Ame: kUli dorakadU nAlidorakadU
goMtu taDupukona nIru dorakadU
rEyiMbagalU rikShA lAgina
addeku pOnU aNA migaladu
gaDapa gaDapaku kaDupu baTTukuni AkalAkalani aMgalArcitE
gETu bigiMcI koTTostAru!
kukkalanE usi kolpistAru Taunu pakka
ataDu: PyAkTarIlalO pani suluvaMTa
gaMTayipOtE iMTlO uMTa
vAraM vAraM baTvADaMTa
orE arE ana vIllEdaMTa
kAPI tOTE gaDapoccaMTa kaburlu ceppuku bratakoccaMTa
cUDa citramaMTa pillA! cOdyamautadaMTa bastIkiataDu : pippayi pOyE picci Karculu pOkiri mUkala sAvAsAlu
cITla pEkalu sigasiga paTlu tAguDu vAguDu tannulATalu
iMTi cuTTunA Igalu dOmalu
iruku saMdulu murugu vAsanalu
aMTurOgamulu tagili caccinA
avatala kIDcE dikku uMDadu  Taunu
ataDu : ElikEstEnu kAlikEstAvu enakku rammani gOla jEstAvu
E dAraMTE gOdAraMTavu irukuna beTTi korukkutiMTav
dikku dOcanIdE pillA! tikamaka jEsEvE
 
Click here to hear the song
అతడు : తింటానిక్కూడు చాలదే, జాంగిరీ ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాం పైసా తెద్దామే రావేనా రంగసానీ!!
ఆమె : టౌను పక్కకెల్లొద్దురా డింగరీ! డాంబికాలు పోవొద్దురా
టౌను పక్కెళ్ళేవు డౌనైపోతావురా రబ్బీ బంగారు సామి!
అతడు : రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
చిల్లరంత జేర్చుకుంట సినిమాలు చూసుకుంట
షికార్లు కొడదామే - పిల్లా జలసా చేద్దామే బస్తీకి
ఆమె: కూలి దొరకదూ నాలిదొరకదూ
గొంతు తడుపుకొన నీరు దొరకదూ
రేయింబగలూ రిక్షా లాగిన
అద్దెకు పోనూ అణా మిగలదు
గడప గడపకు కడుపు బట్టుకుని ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు!
కుక్కలనే ఉసి కొల్పిస్తారు టౌను పక్క
అతడు: ఫ్యాక్టరీలలో పని సులువంట
గంటయిపోతే ఇంట్లో ఉంట
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీ తోటే గడపొచ్చంట కబుర్లు చెప్పుకు బ్రతకొచ్చంట
చూడ చిత్రమంట పిల్లా! చోద్యమౌతదంట బస్తీకిఅతడు : పిప్పయి పోయే పిచ్చి ఖర్చులు పోకిరి మూకల సావాసాలు
చీట్ల పేకలు సిగసిగ పట్లు తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులు మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతల కీడ్చే దిక్కు ఉండదు  టౌను
అతడు : ఏలికేస్తేను కాలికేస్తావు ఎనక్కు రమ్మని గోల జేస్తావు
ఏ దారంటే గోదారంటవు ఇరుకున బెట్టి కొరుక్కుతింటవ్
దిక్కు దోచనీదే పిల్లా! తికమక జేసేవేబస్తీకి నే బోను నీతో ఉంటానే! రాణీ నా రంగసానీ
గొడ్డూ గోదా మేపుకుందాం! కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరానారా జరుపుకుందాం! పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూచుకుందాం! కలో గంజియో తాగి పడుందాం
ఇద్దరు : టౌను పకక్కెళ్ళద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పకకెళ్ళేరు డౌనైపోతారు!
తానే తందాన తాన తందాన! తందాన తానఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment