Song » Naluguru Kalase / నలుగురు కలిసీ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
naluguru kalisI porupulu maricI ceyyAli ummaDi vyavasAyaM mana kistuMdekkuva PalasAyaM idi raitulakeMtO sadupAyaM naluguru oka saMsAraM vaMdekarAlanu paMDiMcaTamE arudukadA adi BariMcalEni baruvu kadA padi kuTuMbamulu veyyekarAlanu sAgu ceyyaDaM suluvu kadA naluguru mahArAjulU jamiMdArulU maccuku dorakani kAlaMlO I prajalE^^E ElE rAjyaMlO itarula kaShTaM dOcuku tinaDaM idiyE sUtraM okkaDU mAtraM BUmini guttaku konarAdu kaDu sOmaripOtai manarAdu nElA nIrU gAlI velugU koMdari sottani anarAdu avi aMdari hakkai alarAru naluguru okokka vyaktI, samasta SaktI dhArapOsi paniceyyAli dhana dhAnyarASulE peMcAli kUTiki guDDaku lOTulEka tanakavasaramainavi poMdAli naluguru Click here to hear the song
నలుగురు కలిసీ పొరుపులు మరిచీ చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం మన కిస్తుందెక్కువ ఫలసాయం ఇది రైతులకెంతో సదుపాయం నలుగురు ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదుకదా అది భరించలేని బరువు కదా పది కుటుంబములు వెయ్యెకరాలను సాగు చెయ్యడం సులువు కదా నలుగురు మహారాజులూ జమిందారులూ మచ్చుకు దొరకని కాలంలో ఈ ప్రజలేఏ ఏలే రాజ్యంలో ఇతరుల కష్టం దోచుకు తినడం ఇదియే సూత్రం ఒక్కడూ మాత్రం భూమిని గుత్తకు కొనరాదు కడు సోమరిపోతై మనరాదు నేలా నీరూ గాలీ వెలుగూ కొందరి సొత్తని అనరాదు అవి అందరి హక్కై అలరారు నలుగురు ఒకొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి ధన ధాన్యరాశులే పెంచాలి కూటికి గుడ్డకు లోటులేక తనకవసరమైనవి పొందాలి నలుగురు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment