Friday, July 10, 2020

Thodikodallu » Adutu Padutu      తోడికోడళ్ళు » ఆడుతు పాడుతు

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Adutu Padutu / ఆడుతు పాడుతు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
ADutu pADutu panicEstuMTE alupu solupEmunnadi
iddarumokaTai cEyikalipitE edurEmunnadi
manaku kodavEmunnadi ADutu
oMpulu tirigi oyyAraMgA Ugutu visurutu gUDEstuMTE
nI gAjulu Gallani mOgutuMTE
nA manassu Jallu maMTunnadi nA manasu Jallu maMTunnadi
tIrani kOrikalUriMpaMgA OrakaMTa nanu cUstuMTE



cilipi navvulu ciMdulu tokki siggu muMcukostunnadi
nanu siggu muMcukostunnadi ADutu
cedari jArina kuMkuma rEKalu pedavulapaina merustu uMTE
tIyani talupulu nAlO EmO tikamaka cEstU unnavi
aha... tikamaka cEstU unnavi ADutu
mATallO mOmATaM nilipi rAgaMlO anurAgaM kalipi
pATapADutuMTE nA madi paravaSamai pOtunnadi
aha paravaSamaipOtunnadi ADutu



Click here to hear the song
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరుమొకటై చేయికలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది ఆడుతు
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊగుతు విసురుతు గూడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనస్సు ఝల్లు మంటున్నది నా మనసు ఝల్లు మంటున్నది
తీరని కోరికలూరింపంగా ఓరకంట నను చూస్తుంటే



చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది
నను సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతు
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తు ఉంటే
తీయని తలుపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి
అహ... తికమక చేస్తూ ఉన్నవి ఆడుతు
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాటపాడుతుంటే నా మది పరవశమై పోతున్నది
అహ పరవశమైపోతున్నది ఆడుతు



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment