Friday, July 24, 2020

Thalla Pellaama » Telugu Jati Manadi      తల్లా పెళ్ళామా » తెలుగు జాతి మనది

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Telugu Jati Manadi / తెలుగు జాతి మనది

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi

    telaMgANa nAdi … rAyalasIma nAdi … sarkAru nAdi … nellUru nAdi ..

    annI kalisina telugunADu … manadE … manadE … manadErA..

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi



    prAMtAlu vErainA mana aMtaraMgamokaTEnannA

    yAsalu vEruga unnA ..mana BASha telugu BAShannA

    vacciMDannA …. vaccADannA … A …..

    vacciMDannA …. vaccADannA varAla telugu okaTEnannA …

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi



caraNaM 1:

    mahABArataM puTTiMdi rANmahEMdravaraMlO

    BAgavataM velasiMdi EkaSilAnagaraMlO

    I reMTilOna Edi kAdanna

    I reMTilOna Edi kAdanna innALLa saMskRuti niMDusunnA

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi



caraNaM 2:

    pOcaMpADu evaridi …nAgArjuna sAgaramevaridi

    pOcaMpADu evaridi …nAgArjuna sAgaramevaridi

    mUDu koMDalu kalipi dunninA mukkAru paMTalu baMDlakettinA

    annapUrNamma kannabiDDalaM . aidu kOTla teluguvAridi

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi



    sipAyi kalahaM vijRuMBiMca narasiMhAlai garjiMcAmu

    svataMtra BArat ki jai

    gAMdhI, nehrUla pilupunaMdukuni satyAgrahAlu cEsAmu

    vaMdEmAtaraM .. vaMdEmAtaraM

    svarAjya siddhi jarigina pimmaTa svarAShTramunu sAdhiMcAmu

    jai viSAlAMdhra

    dESaBaktilO teluguvAriki dITE lEdanipiMcAmu

    telugu jAti manadi …. niMDuga velugu jAti manadi



caraNaM 3:

    iMTilOna aramarikalu uMTE illekki cATAlA

    kaMTilO nalaka tIyAlaMTE kanuguDDu periki vEyAlA

    pAlupoMgu mana telugugaDDanu pagulagoTTavaddu

    pAlupoMgu mana telugugaDDanu pagulagoTTavaddu

    nalugurilO manajAtipErunu navvulapAlu ceyyeddu
పల్లవి:

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

    తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..

    అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది



    ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా

    యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా

    వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..

    వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా …

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది



చరణం 1:

    మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో

    భాగవతం వెలసింది ఏకశిలానగరంలో

    ఈ రెంటిలోన ఏది కాదన్న

    ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది



చరణం 2:

    పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది

    పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది

    మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా

    అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది



    సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము

    స్వతంత్ర భారత్ కి జై

    గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము

    వందేమాతరం .. వందేమాతరం

    స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము

    జై విశాలాంధ్ర

    దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము

    తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది



చరణం 3:

    ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా

    కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా

    పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు

    పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు

    నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

0 comments:

Post a Comment