Friday, July 24, 2020

Swathi Kiranam » Pranathi Pranathi      స్వాతి కిరణం » ప్రణతి ప్రణతి

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Pranathi Pranathi / ప్రణతి ప్రణతి

Song Details:Actor : Mammooty / మమ్ముట్టి ,Actress : Raadhika / రాధిక ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Aalap Raju / ఆలాప్ రాజు ,Song Category : Others
pallavi:

praNati praNati praNati

praNava nAda jagatiki

pamapa mamapa ma pa nI

praNuti praNuti praNuti pradhama kaLA sRuShTiki  praNati
caraNaM:

pUla edalalO pulakalu poDipiMcE BramararavaM OMkAramA

supraBAta vEdikapai SukapikAdi kalaravaM  2

aiMkAramA

pairu pApAlaku jOlalu pADE...... 2

gAlula savvaDi hrIMkAramA

girula Sirasulanu jArE Jarula naDala

alajaDi SrIMkAramA

A bIjAkShara vitatiki

arpiMcE jyOtalivE   praNati
caraNaM:

paMca BUtamula pariShvaMmuna

prakRuti poMdina padaspaMdana 

adi kavanamA

aMtaraMgamuna alalettina sarvAMga saMcalana KElana

adi naTanamA 

kaMTi tudala hariviMTi podala

taLukaMdina suvarNa lEKana

adi citramA

mauna Silala caitanya mUrtulugA

malacina sajIva kalpanA adi SilpamA

A lalitA kaLA sRuShTiki arpiMcE jyOtalivE  praNati
 
Click here to hear the song
పల్లవి:

ప్రణతి ప్రణతి ప్రణతి

ప్రణవ నాద జగతికి

పమప మమప మ ప నీ

ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి  ప్రణతి
చరణం:

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా

సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం  2

ఐంకారమా

పైరు పాపాలకు జోలలు పాడే...... 2

గాలుల సవ్వడి హ్రీంకారమా

గిరుల శిరసులను జారే ఝరుల నడల

అలజడి శ్రీంకారమా

ఆ బీజాక్షర వితతికి

అర్పించే జ్యోతలివే   ప్రణతి
చరణం:

పంచ భూతముల పరిష్వంమున

ప్రకృతి పొందిన పదస్పందన 

అది కవనమా

అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలన

అది నటనమా 

కంటి తుదల హరివింటి పొదల

తళుకందిన సువర్ణ లేఖన

అది చిత్రమా

మౌన శిలల చైతన్య మూర్తులుగా

మలచిన సజీవ కల్పనా అది శిల్పమా

ఆ లలితా కళా సృష్టికి అర్పించే జ్యోతలివే  ప్రణతి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment