Thursday, July 16, 2020

Swathi Kiranam » Konda Konallo      స్వాతి కిరణం » కొండా కోనల్లో

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Konda Konallo / కొండా కోనల్లో

Song Details:Actor : Mammooty / మమ్ముట్టి ,Actress : Raadhika / రాధిక ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Vennelakanti / వెన్నెలకంటి  ,Singer : Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
koMDA kOnallO lOyallO gOdAri gaMgammA sAyallO

koMDA kOnallO lOyallO gOdAri gaMgammA sAyallO

kOri kOri kUsiMdi kOyilamma

kOri kOri kUsiMdi kOyilamma I kOyilamma

koMDA kOnallO lOyallO gOdAri gaMgammA sAyallO

gOdAri gaMgammA sAyallO
nEla pallavi pADaMgA nIli mabbu ADaMgA

rivvuna guvvE sAgaMgA navvE muvvai mrOgaMgA

nElA pallavi pADaMgA nIli mabbu ADaMgA

rivvuna guvvE sAgaMgA navvE muvvai mrOgaMgA

uMgA uMgA rAgaMgA ullAsAlE UgaMgA

uMgA uMgA rAraMraMgA ullAsAlE UgaMgA

Upiri UyalalUgaMgA rEpaTi ASalu tIraMgA

tenugudanaM nOrUraMgA tETagIti gArAbaMgA

tenugudanaM nOrUraMgA tETagIti gArAbaMgA

temmerapai UrEgaMgA vayyAraMgA
Jummani tummeda tIyaMgA kammani rAgaM tIyaMgA

jAjimalli saMpeMga jAnapadAlE niMpaMgA

kammani rAgaM tIyaMgA jAnapadAlE niMpaMgA

ceTTu puTTa neyyaMgA ceTTApaTTAleyyaMgA

ceTTu puTTa neyyaMgA ceTTApaTTAleyyaMgA

cilakA palukulu citraMgA cilikE tEnelu cikkaMgA

ETi pATa lAliMcaMgA tOTa talli lAliMcaMgA

ETi pATa lAliMcaMgA tOTa talli lAliMcaMgA

svarAlanni dIviMcaMga sAvAsaMga
 
Click here to hear the song
కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

కోరి కోరి కూసింది కోయిలమ్మ

కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

గోదారి గంగమ్మా సాయల్లో
నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా

రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా

రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా

ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊగంగా

ఉంగా ఉంగా రారంరంగా ఉల్లాసాలే ఊగంగా

ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగా

తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా

తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా

తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా
ఝుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా

జాజిమల్లి సంపెంగ జానపదాలే నింపంగా

కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా

చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా

చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా

చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా

ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా

ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా

స్వరాలన్ని దీవించంగ సావాసంగ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment