Monday, July 20, 2020

Swathi Kiranam » Jaliga Jabilamma      స్వాతి కిరణం » జాలిగా జాబిలమ్మ

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Jaliga Jabilamma / జాలిగా జాబిలమ్మ

Song Details:Actor : Mammooty / మమ్ముట్టి ,Actress : Raadhika / రాధిక ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
jAligA jAbilamma rEyi rEyaMtA

reppavEyanE lEdu eMducEta eMducEta

padahAru kaLalani padilaMgA uMcanI

A kRuShNa pakShamE edalO ciccupeTTuTacEta
kATuka kaMTinIru pedavulanaMTanIku

cirunavvu dIpakaLika cinnabOnIyaku

nI bujji gaNapatini bujjagiMci cebutunnA

nI kuMkamakepuDU podduguMkadammA
sunni piMDini nalici cinnArigA malici

saMtasAna munigiMdi saMtulEni pArvati

sutuDanna mati maraci SUlAna meDavirici

peddarikamu cUpe ciccukaMTi penimiTi
prANapatinaMTuMdA biDDa gati kaMTuMdA

A reMDu kaLLallO adi kannITi citi

kAlakUTamu kanna GATaina garaLamidi

goMtunulimE gurutai veMTanE uMTuMdi
ATu pOTu GaTanalivi ATaviDupu naTanalivi

AdiSaktivi nIvu aMTavu ninnEvi

nI bujji gaNapatini bujjagiMci cebutunnA

kaMci keLLipOyEvE kadhalannI
 
Click here to hear the song
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
కాటుక కంటినీరు పెదవులనంటనీకు

చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి

సంతసాన మునిగింది సంతులేని పార్వతి

సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి

పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా

ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి

కాలకూటము కన్న ఘాటైన గరళమిది

గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి

ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment