Song » Evevo chilipi / ఏవేవో చిలిపి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Savithri / సావిత్రి Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
S. Janaki / యస్. జానకి Song Category : Others
ataDu: EvEvO cilipi talapulurukutunnavi avi elA elA ceppAlO teliyakunnadi EvEvO.... Ame: EvEvO valapu talapulurukutunnavi avi elA elA ceppAlO teliyakunnadi EvEvO.... ataDu: kurulalOna mallepUlu kulukucunnavi aravirisina paDucutanaM pilucucunnadi Ame: marapurAni tolirEyi marala rAnidi maguva jIvitAna idE madhuramannadi EvEvO cilipi talapulurukutunnavi avi elA elA ceppAlO teliyakunnadi EvEvO ataDu: okka kShaNaM Ame: A hA hA ataDu: okkakShaNaM jAripOtE dakkanannadi kAlAniki bigi kaugili kaLLemannadi Ame: kanne manasu EvEvO kalalu kannadi A kalala rUpu I rEyE kAMcamannadi ataDu: AhA! Ame: OhO! ||EvEvO|| ataDu: tIyanaina talapu lEvO musurukonnavi tIsiyunna talapulanu mUyamannadi Ame: manasu tOTi tanuvukUDa nIdi kAnunnadi manugaDa I nATitO manadi kAnunnadi ||EvEvO|| ౪. రచన: ఆత్రేయ గానం: ఘంటసాల, సుశీల శారద : ఏనాటికైనా _ఏ జన్మనైనా నీ తోడు నీడగ నీ చేయి వీడక నీ అడుగు జాడలే అనుసరిస్తాను విశ్వం: కన్నులు నీవే కావాలి కలనై నేనే నిలవాలి శారద: కవితే నీవై వురకాలి కావ్యం నేనై నిలవాలి ||||కన్ను|| శారద: మనసు నేనై వుండాలి మమత నీవై నిండాలి విశ్వం: కడలి నేనై పొంగాలి నదివి నీవై చేరాలి నదివి నీవై చేరాలి ||కన్ను|| విశ్వం: తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి శారద: దైవంనీవై నడవాలి ధర్మం నేనై నడవాలి ధర్మం నేనై నడవాలి || కన్ను|| విశ్వం: శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి శారద: చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి ||కన్ను||
అతడు: ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో.... ఆమె: ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో.... అతడు: కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది ఆమె: మరపురాని తొలిరేయి మరల రానిది మగువ జీవితాన ఇదే మధురమన్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో అతడు: ఒక్క క్షణం ఆమె: ఆ హా హా అతడు: ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది ఆమె: కన్నె మనసు ఏవేవో కలలు కన్నది ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది అతడు: ఆహా! ఆమె: ఓహో! ||ఏవేవో|| అతడు: తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి తీసియున్న తలపులను మూయమన్నది ఆమె: మనసు తోటి తనువుకూడ నీది కానున్నది మనుగడ ఈ నాటితో మనది కానున్నది ||ఏవేవో||
0 comments:
Post a Comment