Song » Natanam Adenae / నటనం ఆడెనే
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Sulakshana / సులక్షణ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: naTanaM ADenE ||2|| Bava timirahaMSuDA parama SivuDu naTakAvataMSuDai taka dhimi taka yani naTanaM ADenE caraNaM 1: enimidi dikkulu okkaTainaTula eMDa vennelai velluvainaTula ||2|| niTAlAkShuDE tuShArAdri viDi viSAlAkShitO tALa layagatula naTanaM ADenE caraNaM 2: SivagaMga Sivametti poMgagA nelavaMka sigapUvu navvagA ||2|| hariharAtmakaM agucU aKila prapaMcammu garuDanAdAnaMda kAvyamai varalagA naTanaM ADenE ADenE caraNaM 3: vasudha vasaMtAlAlapiMcagA suralu sudhanu dharalO kuripiMcagA ratI manmadhulu kumAra saMBava SuBOdayAniki nAMdi palukagA naTanaM ADenE, Bava timira haMSuDA paramaSivuDu naTakAvataMSuDai taka dhimi taka yani naTanaM ADenE, Bava timira haMSuDI paramaSivuDu naTakAvataMSuDai taka dhimi takayani naTanaM ADenE
పల్లవి: నటనం ఆడెనే ||2|| భవ తిమిరహంశుడా పరమ శివుడు నటకావతంశుడై తక ధిమి తక యని నటనం ఆడెనే చరణం 1: ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల ఎండ వెన్నెలై వెల్లువైనటుల ||2|| నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం ఆడెనే చరణం 2: శివగంగ శివమెత్తి పొంగగా నెలవంక సిగపూవు నవ్వగా ||2|| హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము గరుడనాదానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే చరణం 3: వసుధ వసంతాలాలపించగా సురలు సుధను ధరలో కురిపించగా రతీ మన్మధులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా నటనం ఆడెనే, భవ తిమిర హంశుడా పరమశివుడు నటకావతంశుడై తక ధిమి తక యని నటనం ఆడెనే, భవ తిమిర హంశుడీ పరమశివుడు నటకావతంశుడై తక ధిమి తకయని నటనం ఆడెనే
0 comments:
Post a Comment