Song » Mandhara Makaranda / మందార మకరంద
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Sulakshana / సులక్షణ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Bammera Pothana / బమ్మెర పోతన ,
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: maMdAra makaraMda mAdhuryamuna dElu madhupaMbu pOvunE madanamulaku? nirmala maMdAkinI vIcikala tUgu rAyaMca canunE taraMgiNulaku?! A..A.. A ciMta nIkElarA... A ciMta nIkElarA svAmI!.. nI ceMta nEnuMDagA.. A ciMta nIkElarA... A ciMta nIkElarA svAmI!.. nI ceMta nEnuMDagA.. A ciMta nIkElarA! soMtamaina nI sogasunElaka paMtamEla pUbaMti vEDagA soMtamaina nI sogasunElaka paMtamEla pUbaMti vEDagA A ciMta nIkElarA? caraNaM 1: sarasAla manugaDa sagapAlu cEsi... varasaina nA yIDu nI tODu peTTi sarasAla manugaDa sagapAlu cEsi... varasaina nA yIDu nI tODu peTTi... arudaina muripAla perugu mIgaDalannI karigiMci kaugiLLa tinipiMcagA.... A..A..A..A ||A ciMta|| caraNaM 2: A vaMka A vennelammA.. I vaMka I vannelamma A vaMka A vennelammA.. I vaMka I vannelamma yE vaMka lEni nelavaMka nEnammA... nIkiMka alakeMdukammA? lalita rasAla pallava KAdiyai cokku kOyila cErunE kuTajamulaku pUrNEMdu caMdrikA sPurita cakOra marugunE sAMdranIhAramulaku vinuta guNaSIla mATalu vEyunELA? ||A ciMta||
పల్లవి: మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు?! ఆ..ఆ.. ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ!.. నీ చెంత నేనుండగా.. ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ!.. నీ చెంత నేనుండగా.. ఆ చింత నీకేలరా! సొంతమైన నీ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా సొంతమైన నీ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా ఆ చింత నీకేలరా? చరణం 1: సరసాల మనుగడ సగపాలు చేసి... వరసైన నా యీడు నీ తోడు పెట్టి సరసాల మనుగడ సగపాలు చేసి... వరసైన నా యీడు నీ తోడు పెట్టి... అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ కరిగించి కౌగిళ్ళ తినిపించగా.... ఆ..ఆ..ఆ..ఆ ||ఆ చింత|| చరణం 2: ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ యే వంక లేని నెలవంక నేనమ్మా... నీకింక అలకెందుకమ్మా? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర మరుగునే సాంద్రనీహారములకు వినుత గుణశీల మాటలు వేయునేళా? ||ఆ చింత||
0 comments:
Post a Comment