Song » Manasaa Tullipadakae / మనసా తుళ్ళిపడకే
Song Details:Actor :
Naresh / నరేష్ ,Actress :
Poornima Jayaram / పూర్ణిమా జయరాం ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: manasA tuLLipaDakE atigA ASapaDakE ataniki nIvu naccAvO lEdO A SuBaGaDiyA vaccEnO rAdO toMdarapaDitE alusE manasA ..... telusA manasA tuLLipaDakE atigA ASapaDakE caraNaM 1: EmaMta aMdAlu kalavanI ..... vastADu ninnu valaci EmaMta siri uMdi nIkanI ..... murisEnu ninnu talaci caduvA ..... padavA ..... EmuMdi nIku taLuku ..... kuluku ..... lEvamma nIku SrutimiMcakE nIvu manasA !!manasA tuLLi!! caraNaM 2: E nOmu nOcAvu nIvanI ..... dorikEnu A prEmaPalamu E dEvuDistADu nIkanI ..... arudaina aMta varamu manasA vinavE maha aMdagADu kanukA jatagA manakaMdirADu kalalApavE kanne manasA manasA tuLLipaDakE atigA ASapaDakE ataniki nIvu naccAvO lEdO A SuBaGaDiyA vaccEnO rAdO toMdarapaDitE alusE manasA ..... telusA manasA tuLLipaDakE atigA ASapaDakE
పల్లవి: మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభఘడియా వచ్చేనో రాదో తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే చరణం 1: ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి చదువా ..... పదవా ..... ఏముంది నీకు తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు శ్రుతిమించకే నీవు మనసా !!మనసా తుళ్ళి!! చరణం 2: ఏ నోము నోచావు నీవనీ ..... దొరికేను ఆ ప్రేమఫలము ఏ దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు కలలాపవే కన్నె మనసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభఘడియా వచ్చేనో రాదో తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
0 comments:
Post a Comment