Monday, July 27, 2020

Srivariki Premalekha » Lipi leni kanti      శ్రీవారికి ప్రేమలేఖ » లిపి లేని కంటి

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Lipi leni kanti / లిపి లేని కంటి

Song Details:Actor : Naresh / నరేష్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa

nI kannula kATuka lEKalalO

nI sogasula kavitA rEKalalO

ilA ilA cadavanI nI lEKani praNaya lEKani

badulaina lEni lEKa bratukaina prEmalEKa

nI kaugiTa bigisina svASalatO

nI kavitalu nErpina prAsalatO

ilA ilA rAyanI nA lEKani praNaya rEKani

lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa
amAvASya niSilO kOTi tAralunna AkASaM

vedukutu uMdi vEdana tAnai vidiya nATi jAbili kOsaM

velugunIDalennunnA velagalEni AkASaM

edugutu uMdI vennela tAnai okkanATi punnami kOsaM
lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa
akSharAla nIDalalO nI jADalu cUsukuni

A padAla allikalO nI pedavulu addukuni

nI kaMTiki pApanu nEnai nI iMTiki vAkili nEnai

gaDapa dATalEka nannE gaDiya vEsukunnAnu

gaDiyainA nIvulEka gaDapalEka unnAnu
badulaina lEni lEKa bratukaina prEmalEKa

nI kaugiTa bigisina svAsalatO

nI kavitalu nErpina prAsalatO

ilA ilA rAyanI nA lEKani praNaya rEKani

lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

నీ కన్నుల కాటుక లేఖలలో

నీ సొగసుల కవితా రేఖలలో

ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని

బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ

నీ కౌగిట బిగిసిన స్వాశలతో

నీ కవితలు నేర్పిన ప్రాసలతో

ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం

వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం

వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం

ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని

ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని

నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై

గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను

గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ

నీ కౌగిట బిగిసిన స్వాసలతో

నీ కవితలు నేర్పిన ప్రాసలతో

ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

0 comments:

Post a Comment