Monday, July 13, 2020

Srimanthudu » Srimanthudaa      శ్రీమంతుడు » శ్రీమంతుడా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Srimanthudaa / శ్రీమంతుడా
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : M.R.L. Karthikeyan / ఎమ్.ఆర్.ఎల్. కార్తికేయన్  ,Song Category : Inspiring & Motivational Songs

నిండు భూమి నిను రెండు చేతులతొ 

   కౌగిలించమని పిలిచినదా

 పిలుపు వినరా మలుపు కనరా 

   పరుగువై పదపదరా

 గుండె దాటుకుని పండుగైన కల 

   పసిడి దారులను తెరిచినదా

 ఋణము తీర్చే తరుణమిదిరా 

   కిరణమై పదపదరా

 ఏమి వదిలి ఎటు కదులుతోందొ 

   మది మాటకైన మరి తలచినదా

 మనిషితనమే నిజము ధనమై 

   పరులకై పదపదరా

 మరలి మరల వెనుదిరుగనన్న 

   చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా

 మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా

 లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం

 ప్రేమై వర్షించనీ నీ ప్రాణం

 సాయం సమాజమే నీ గేయం నిరంతరం

 కోరే ప్రపంచ సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం

 విశ్వమంతటకి పేరు పేరునా 

   ప్రేమ పంచగల పసితనమా

 ఎదురుచూసే ఎదలు మీటే పవనమై పదపదరా

 లేనిదేలో పని లేనిదేలో విడమరిచి 

   చూడగల ఋషిగుణమా

 చిగురు మురిసే చినుకు తడిగా 

   పయనమై పదపదరా

 పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా

 నీలో లక్ష్యానికి జయహో...

 పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా

 నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా 

   జయహో జయహో

0 comments:

Post a Comment