Monday, July 13, 2020

Srimanthudu » Jatha kalise      శ్రీమంతుడు » జత కలిసే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Jatha kalise / జత కలిసే
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Sagar / సాగర్ ,  Suchitra / సుచిత్ర ,Song Category : Love & Romantic Songs

జత కలిసే జత కలిసే

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే

జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే

జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు

అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ



నలుపు జాడ నలుసైనా అంటుకోని  హృదయాలు

తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు

మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు

ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు

పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ

ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా

బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు

 

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు



ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం

ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం

నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం

చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం

నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది

ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా

ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు

  

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

0 comments:

Post a Comment