Monday, July 13, 2020

Srimanthudu » Jagho jagore      శ్రీమంతుడు » జాగో జాగోరే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Jagho jagore / జాగో జాగోరే
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Rita / రీటా  ,Song Category : Inspiring & Motivational Songs

నేల నేల నేల... నవ్వుతోంది నాలా 

నట్ట నడిబొడ్డు సురీడులా

వేల వేల వేల... సైన్యమై 

ఈ వేళ దూసుకెళ్లమంది నాలో కల



సర్ర సరా సరా... ఆకాశం కోసేసా

రెండు రెక్కలు తొడిగేసా... తొడిగేసా

గిర్ర గిరా గిరా... భూగోళం చుట్టూరా

గుర్రల వేగంతో తిరిగేసా... తిరిగేసా

ఏ కొంచం కల్తీలేని కొత్త చిరుగాలై

ఎగరేసా సంతోషాల జండా... జండా



జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో 

జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో.. ఓ...



వెతికా నన్ను నేను

దొరికా నాకు నేను

నాలో నేనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి

పంచేస్తాను నన్ను

పరిచేస్తాను నన్ను

ఎనిమిదిక్కులన్ని పొంగిపోయి ప్రెమై వెలిగి



గుమ్మ గుమ్మా గుమ్మా... గుడెల్ని తాకేలా

గంధాల గాలల్లే వస్తా... హే వస్తా

కొమ్మకొమ్మా రెమ్మా... పచ్చంగ నవ్వేలా

పన్నీటి జల్లుల్నే తెస్తా... హే తెస్తా

ఎడారిని కడలిగ చేస్తా... చేస్తా



జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో 

జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో.. ఓ...



స్వార్ధం లేని చెట్టు బదులే కోరనంటూ

పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే

ఏమీ పట్టనంటు బంధం తెంచుకుంటు

మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే



సల్ల సలా సలా... పొంగిందే నా రక్తం

న చుట్టూ కన్నీరే కంటే.. హే కంటే

విల్ల విలావిలా... అల్లాడిందే ప్రాణం

చేతైన మంచే చేయకుంటే... చేయకుంటే

ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే... ఉంటే



జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో 

జాగో జాగోరే.. జాగో జాగోరే..

జాగో జాగోరే.. జాగో.. ఓ... జాగో!!

0 comments:

Post a Comment