Friday, July 10, 2020

Sri Rama Rajyam » Sita Rama Charitham      శ్రీ రామ రాజ్యం » సీతారామ చరితం

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Sita Rama Charitham / సీతారామ చరితం
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Nayantara / నయన తార ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : Anitha / అనిత ,  Keerthana / కీర్తన ,Song Category : Devotional Songs
sItaaraama caritaM
shrI seetaaraama caritaM 
gaanaM janma saPalaM shravaNaM paapaharanaM
prathi padapadamuna sruthilayanvitham chatruvedaninutham
raagavidhitaM Adikavi vaalmiki rachitaM
sItaaraama caritaM mm mm..kOdaMDapaaniyaa daMDakaaraNyamuna koluvuMDE bhaaryatO niMDugaaa..
kOdaMDapaaniyaa daMDakaaraNyamuna koluvuMDE bhaaryatO niMDugaaa..
aMDagaMDa dammuDuMDagaa aDavitalliki kannula paMDugaa..
suMdara raamuni mUyiMche raavaNa sOdari surpanakaa..
suddulu telipi pommanina haddulu mIri paipaDagaa...
tappanisarai lakShmaNuDE mukku cevulanu kOsE..
annaa chUDani akkasukakkutu raavaNu cErenu rakkasi eeee…
daarunamugaa maayacEsenu raavaNuDU U U..
maayalEDi ainaaDu maarEshuDU..
seeta koraku daanni venuka parigEnu shrIraamuDu u..
adanu cUsi seetani apahariMcE raavaNuDu u..
talali naDuma laMka lOna kaliki seetanuMce  talupuguMDelO paasala kaapalagaa uMcI
shOkajaladhi tanainadi vaidEhI...aa shOkajaladhilO munigE dhaasharathi ee ee
sItaa sItaa aa..sItaa sItaa aa..ani sItaki vinipiMcElaa rOdhashikaM peMcElaa...
rOdhiMcE sItaapati..raamuni mOmuna dhInata cUsi vekki EDcinavi vEdamulE
sItakeMdukI viShaadaM..raamunikEla viyOgaM..
kamalaanayanamulu munigE.. poMgE kannITilO..
cUDalEka aa sUryuDE dUkenu munnITilO..
cUDalEka aa sUryuDE dUkenu munnITilO..vaanara raajaku sugrIvunitO raamuni kalipE maarutI
jaladhini daaTi laMkaku cEragaa kanapaDanakkaDa jaanakI
raamuni uMgaramu ammaku iccI raamuni maaTala OdaarcI..
laMkanu kaalcE vaayanumaa vaccE sItaa shirOmaNi raamunikiccI
cUsinadaMtaa cEsinadaMtaa telipE pUsa guccI..vaayuvEgamuna vaanara sainyamu kadiliki daarini kaTTeraa..
vaana vEgamunaa raamabhadruDaa raavaNatanapa koTTEraa
mudamuna cErETi kulasati seetani dUramugaa.. nilabeTTeraa..
aMta baadhapaDi seetakOsamani iMta cEsi shrI raamuDu u u u u u.
ceMta cEra jagamaMtacuDagaa viMta pareekSha vidhiMchenu u
eMduku I pareekShaa.. evvarikee pareekShaa..
eMduku I pareekShaa.. evvarikee pareekShaa..
shrI raamuni bhaaryakaa..shIla pareekShaa aa koluvunijakiavanijaka mutni pareekShaa..
daasharadhuni koDalikaaa dharma pareekShaa.. janakuni kUturikaa anuvala pareekShaa a..
raamuni praaNaanikaa.. jaanaki dhEhanikaa..sUryuni vaMshaanikaa ee lOkam nOTikaa..
evvarikee pareekShaa..eMduku ee pareekShaa..
shree raamaa aa aa aa.aggilOki dUkE avamaanamutO sati
aggilOki dUkE avamaanamutO sati
niggu tEli siggu paDE saMdhEhapu jagati..
agnihOtruDE palike dikkulu maarmOgagaa seeta mahaa pativrataani jagamE praNavillagaa
lOkulaMdariki seetE punitani caaTE nETi shrI raamuDu
a jaanakitO ayodhya kEgenu sakala varma sadeepuDu
seetaa samEta shree raamuDu u u u 
Click here to hear the song
సీతారామ చరితం ... శ్రీ సీతారామ చరితం

గానం జన్మ సఫలం ... శ్రవణం పాపహరణం

ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం 

చతుర్వేదవినుతం ...లోకవిదితం 

ఆదికవి వాల్మీకి రచితం ... సీతారామచరితంకోదండపాణి ఆ దండకారణ్యమున 

కొలువుండె భార్యతో నిండుగా

కోదండపాణి ఆ దండకారణ్యమున 

కొలువుండె భార్యతో నిండుగా

అండదండగ తమ్ముడుండగ 

కడలితల్లికి కనుల పండుగసుందర రాముని మోహించె రావణ సోదరి శూర్పణఖ

సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా

తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి

అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసిదారుణముగ మాయ చేసె రావణుడు 

మాయలేడి అయినాడు మారీచుడు

సీత కొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు 

అదను చూసి సీతని అపహరించె రావణుడు 

కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి

కరకు గుండె రాకాసుల కాపలాగ వుంచిశోక జలధి తానైనది వైదేహి 

ఆ శోక జలధిలో మునిగె దాశరధి

సీతా సీతా ... సీతా సీతా అని

సీతకి వినిపించేలా... రోదసి కంపించేలా రోదించె సీతాపతిరాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే

సీతకెందుకీ విషాదం ... రామునికేలా వియోగం

కమలనయనములు మునిగె  పొంగే కన్నీటిలో 

చూడలేక ఆ సూర్యుడే దూకెను మున్నీటిలో 

చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలోవానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి

జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి

రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి

లంకను కాల్చి రయమున వచ్చి

సీత శిరోమణి రామునికిచ్చి   

చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చి వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా

బాణవేగమున రామభద్రుడా రావణు తల పడకొట్టెరా

ముదమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెరా 

అంత బాధ పడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు

చెంత చేర ... జగమంత చూడగా... వింత పరీక్ష విధించెనుఎందుకు ఈ పరీక్ష .. ఎవ్వరికీ పరీక్ష 

ఎందుకు ఈ పరీక్ష .. ఎవ్వరికీ పరీక్ష

శ్రీరాముని భార్యకా శీలపరీక్ష 

అయోనిజకి అవనిజకా అగ్నిపరీక్ష

దశరథుని కోడలికా ధర్మపరీక్ష 

జనకుని కూతురికా అనుమాన పరీక్ష

రాముని ప్రాణానికా జానకి దేహానికా 

సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా

ఎవ్వరికీపరిక్ష .. ఎందుకు ఈ పరీక్ష ... శ్రీరామాఅగ్గిలోకి దూకె అవమానముతో సతి 

అగ్గిలోకి దూకె అవమానముతో సతి

నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి 

అగ్నిహొత్రుడే పలికె దిక్కులు మార్మోగగా

సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా

లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు

ఆ జానకితో అయోధ్య కేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment