Friday, July 24, 2020

Sri Krishna Pandaveeyam » Swagatam...      శ్రీకృష్ణ పాండవీయం » స్వాగతం...

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Swagatam... / స్వాగతం...

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
svAgataM... svAgataM su svAgataM
svAgataM kurusArvaBauma svAgataM su svAgataM
Sata sOdara saMsEvita sadanA aBimAnadhanA suyOdhanA
svAgataM su svAgataM
maccalEni nelarAjuvu nIvE
manasulOni vala rAjuvu nIvE
rAgaBOga sura rAjuvu nIvE
rAjulakE rArAjuvu nIvE
dharaNi pAla SirOmakuTa maNi taruNa kiraNa pariraMjita caraNA
svAgataM su svAgataM
talapulanni pannITi jallulai
valapulanni virajAjimallelai
ninnu mEmu sEviMcuTannadi
enni janmamula punnemO adi
kadana raMga bAhudaMDa dhRuta gadA prakaTa paTu SauryA BaraNA
svAgataM su svAgataM
స్వాగతం... స్వాగతం సు స్వాగతం
స్వాగతం కురుసార్వభౌమ స్వాగతం సు స్వాగతం
శత సోదర సంసేవిత సదనా అభిమానధనా సుయోధనా
స్వాగతం సు స్వాగతం
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే
రాగభోగ సుర రాజువు నీవే
రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సు స్వాగతం
తలపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజిమల్లెలై
నిన్ను మేము సేవించుటన్నది
ఎన్ని జన్మముల పున్నెమో అది
కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు శౌర్యా భరణా
స్వాగతం సు స్వాగతం

0 comments:

Post a Comment