Friday, July 10, 2020

Sri Krishna Pandaveeyam » Mattu vadalaraa      శ్రీకృష్ణ పాండవీయం » మత్తు వదలరా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Mattu vadalaraa / మత్తు వదలరా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
kRuShNuDu_musali bAhmaNuDu:
apAyammu  dATaDAni kupAyammu kAvAli!
aMdhakAra malaminapuDu veluturukai  vedakAli!
muMdu cUpulEnivADu _eMdunakU koragADu!
sOmariyai kunukuvADu sUkShmammu grahiMcalEDu!
mattuvadalarA_ niddura mattuvadaladA!
A mattulOna paDitE_ gammattuga cittauduvurA!               ||mattu||
jIvitamuna sagabAgaM_niddurakE saripOvu
migilina A sagabAgaM_cittaSuddilEkapOvu
ati nidrA lOluDu _ telivilEni mUrKuDu
paramArdhaM kAnalEka_ vyardhaMgA ceDatADu                    ||mattu||
sAginaMtakAlaM _nA  aMtavADu  lEDaMduru
sAgakapOtE Uraka catikilabaDipOduru
kaMDabalamutOTE GanakArmamu sAdhiMcalEru
buddhibalamu tODaitE vijayammu variMpagalaru            ||mattu||
cuTTu muTTu Apadalunu_ maTTubeTTa bUnumurA!
pirikitanamu kaTTipeTTi_ dairyamu cEpaTTumurA!
kartavyamu nI vaMtu_kApADuTa nAvaMtu!
ceppaDamE nA dharmaM_vinakapOtE nI KarmaM                 || mattu||
కృష్ణుడు_ముసలి బాహ్మణుడు:
అపాయమ్ము  దాటడాని కుపాయమ్ము కావాలి!
అంధకార మలమినపుడు వెలుతురుకై  వెదకాలి!
ముందు చూపులేనివాడు _ఎందునకూ కొరగాడు!
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు!
మత్తువదలరా_ నిద్దుర మత్తువదలదా!
ఆ మత్తులోన పడితే_ గమ్మత్తుగ చిత్తౌదువురా!               ||మత్తు||
జీవితమున సగబాగం_నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగబాగం_చిత్తశుద్దిలేకపోవు
అతి నిద్రా లోలుడు _ తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక_ వ్యర్ధంగా చెడతాడు                    ||మత్తు||
సాగినంతకాలం _నా  అంతవాడు  లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలముతోటే ఘనకార్మము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు            ||మత్తు||
చుట్టు ముట్టు ఆపదలును_ మట్టుబెట్ట బూనుమురా!
పిరికితనము కట్టిపెట్టి_ దైర్యము చేపట్టుమురా!
కర్తవ్యము నీ వంతు_కాపాడుట నావంతు!
చెప్పడమే నా ధర్మం_వినకపోతే నీ ఖర్మం                 || మత్తు||

0 comments:

Post a Comment