Saturday, July 11, 2020

Sri Krishna Pandaveeyam » Bhalaa Bhalaa naa bande      శ్రీకృష్ణ పాండవీయం » భళా భళా నా బండీ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Bhalaa Bhalaa naa bande / భళా భళా నా బండీ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Others
BImuDu: OhO.. hO...
BaLA BaLA nA baMDI... parugutIsE baMDi
baMDilO tiMDi jUDa _ brahmaku nOrUrunaMDi        ||BaLA||
tiMDi lEnidE kaMDa lEdurA! kaMDa lEnidE guMDe rAdurA! hE tammuDU!
guMDe diTavugA nunnacO _ brahmAMDamulOnE eduru lEdurA
karakara Akali maMDutuvuMTE _ kammani BOjana medurugavuMTE
guTakalu mriMgucu kUrconuvADu _ uMTE vADu verrivADu        ||BaLA||
aTTurA ! minapaTTurA! dInnodili peTTEdeTTurA!
tIpi tIpi bobbaTTurA ! aha tiMTE Akali kaTTurA!
papputOTi mudda galipi _ paccaDitO anupAnamEsi
bakka pEgulaku paTTistuMTE _ ceppa SakyamA dIni ruci            ||BaLA||
sATi lEni jagajeTTi BImuni _ cEtula tITa tIrunulE
ari cEtula tITa tIrunulE
Eka cakra purAvAsula beDada _ nETi tOne pari mArunulE
talli ruNammunu tIrceda _ nA dharmammunu neravErceda
O AtmabaMdhU ! nI aMDa vuMTe evaraDDamaina parimArceda        ||BaLA||
భీముడు: ఓహో.. హో...
భళా భళా నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ _ బ్రహ్మకు నోరూరునండి        ||భళా||
తిండి లేనిదే కండ లేదురా! కండ లేనిదే గుండె రాదురా! హే తమ్ముడూ!
గుండె దిటవుగా నున్నచో _ బ్రహ్మాండములోనే ఎదురు లేదురా
కరకర ఆకలి మండుతువుంటే _ కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు _ ఉంటే వాడు వెర్రివాడు        ||భళా||
అట్టురా ! మినపట్టురా! దీన్నొదిలి పెట్టేదెట్టురా!
తీపి తీపి బొబ్బట్టురా ! అహ తింటే ఆకలి కట్టురా!
పప్పుతోటి ముద్ద గలిపి _ పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే _ చెప్ప శక్యమా దీని రుచి            ||భళా||
సాటి లేని జగజెట్టి భీముని _ చేతుల తీట తీరునులే
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద _ నేటి తోనె పరి మారునులే
తల్లి రుణమ్మును తీర్చెద _ నా ధర్మమ్మును నెరవేర్చెద
ఓ ఆత్మబంధూ ! నీ అండ వుంటె ఎవరడ్డమైన పరిమార్చెద        ||భళా||

0 comments:

Post a Comment