
Song » Aadave Hamsa gamana / ఆడవే హంస గమనా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,Song Category : Others
madhupa nisvanamutO... accaralakainA... accaralakainA... maccaramu galgu accatelugu kRutulatO aBinavAkRutulatO ADavE... haMsagamanA caraNaM : 2 pArAvatAla kalakUjitAla SRuMgAra madhurimalatO jalada nAdAlu... jalada nAdAlu jatulugA... jalada nAdAlu jatulugA jaladariMcu BaMgimalatO nI aBinayAna... nI aBinayAna I aKila jagamu OlalADagA uyyAlUgagA... ADavE... haMsagamanA caraNaM : 3 nRutyamu kadalADu sAhityamu nATyamu kanupiMcu saMgItamu || anuBavAna rasavEdamu ananuBUta kalanAdamu nRutyAvasAnE naTarAjarAja ninAda DhakkAM navapaMcavAramu naTarAja hastaDhamarukArBaTi spuTa vA~gmayAkShara dIpamu I j~jAta guruvu aj~jAta vijayuDai AnaMdamoMdagA ninnASIrvadiMcagA ADavE... ADavE... ADavE... haMsagamanA
పల్లవి : ఆడవే... హంసగమనా (2) నటనమాడవే ఇందువదనా మానస లాలస మధురస నటనా (2) నరనారాయణ... నవరస ఘటన... ఆడవే... ఆడవే... హంసగమనా చరణం : 1 చరణ మందార చలిత మంజీర మధుప నిస్వనముతో... చరణ మందార చలిత మంజీర మధుప నిస్వనముతో... అచ్చరలకైనా... అచ్చరలకైనా... మచ్చరము గల్గు అచ్చతెలుగు కృతులతో అభినవాకృతులతో ఆడవే... హంసగమనా చరణం : 2 పారావతాల కలకూజితాల శృంగార మధురిమలతో జలద నాదాలు... జలద నాదాలు జతులుగా... జలద నాదాలు జతులుగా జలదరించు భంగిమలతో నీ అభినయాన... నీ అభినయాన ఈ అఖిల జగము ఓలలాడగా ఉయ్యాలూగగా... ఆడవే... హంసగమనా చరణం : 3 నృత్యము కదలాడు సాహిత్యము నాట్యము కనుపించు సంగీతము ॥ అనుభవాన రసవేదము అననుభూత కలనాదము నృత్యావసానే నటరాజరాజ నినాద ఢక్కాం నవపంచవారము నటరాజ హస్తఢమరుకార్భటి స్పుట వాఙ్మయాక్షర దీపము ఈ జ్ఞాత గురువు అజ్ఞాత విజయుడై ఆనందమొందగా నిన్నాశీర్వదించగా ఆడవే... ఆడవే... ఆడవే... హంసగమనా
0 comments:
Post a Comment