Monday, July 6, 2020

Sree Venkateswara Mahatmyam » Chiru Chiru Nagavula శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం » చిరు చిరు నగవుల

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Chiru Chiru Nagavula / చిరు చిరు నగవుల
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  Actress : Savithri / సావిత్రి Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Shantha Kumari . P . / పి. శాంతకుమారి  Song Category : Others
yaSOda : ciru ciru nagavula cilikE taMDrI murisitinayyA punnemu paMDI ciru
navvulE iMta tIyanainavE palukuleMtagA madhuramulaunO
vini saMbarapaDa madi toMdarapaDe makkuva tIrA mATalADarA ciru
yadubAlA! gOpAlA! aMdela Gallana iTurArA yadu
cakkani nAnnA Takkulu mAnI akkuna cEri ammA anarA cakka
allibili jAbilli ATalA ninu cUci poMgi tariMtunurA yadu
koMTevADu nI tuMTari panulaku gOkulamaMtA gOlapeTTerA
kRuShNa : allari cEyani pillaliMTiki alaMkAramu kAru kAdammA?
yaSOda : alAgA! peMDli cEsi nIkALLaku baMdhamu vEyAlayyA vennadoMgA!
kRuShNa : attarikamu cEyAlani nIku ASagavuMdani anavammA
yaSOda : avunayyA.... adE nA kOrika... eppuDu tIrustAvu nAyanA
click here to hear the song
యశోద : చిరు చిరు నగవుల చిలికే తండ్రీ మురిసితినయ్యా పున్నెము పండీ చిరు
నవ్వులే ఇంత తీయనైనవే పలుకులెంతగా మధురములౌనో
విని సంబరపడ మది తొందరపడె మక్కువ తీరా మాటలాడరా చిరు
యదుబాలా! గోపాలా! అందెల ఘల్లన ఇటురారా యదు
చక్కని నాన్నా టక్కులు మానీ అక్కున చేరి అమ్మా అనరా చక్క
అల్లిబిలి జాబిల్లి ఆటలా నిను చూచి పొంగి తరింతునురా యదు
కొంటెవాడు నీ తుంటరి పనులకు గోకులమంతా గోలపెట్టెరా
కృష్ణ : అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారు కాదమ్మా?
యశోద : అలాగా! పెండ్లి చేసి నీకాళ్ళకు బంధము వేయాలయ్యా వెన్నదొంగా!
కృష్ణ : అత్తరికము చేయాలని నీకు ఆశగవుందని అనవమ్మా
యశోద : అవునయ్యా.... అదే నా కోరిక... ఎప్పుడు తీరుస్తావు నాయనా
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment