Friday, July 17, 2020

Sree Ramadasu » A Murti Mudu murthuluga      శ్రీ రామదాసు » ఏ మూర్తి మూడుమూర్తులుగ

July 17, 2020 Posted by Publisher , No comments

Song » A Murti Mudu murthuluga / ఏ మూర్తి మూడుమూర్తులుగ
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sneha / స్నేహ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sri Vedavyasa / శ్రీ వేదవ్యాస  ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,  Vijay Yesudas / విజయ్ ఏసుదాసు ,Song Category : Devotional Songs
pallavi:

    allA A A A...



    SrIrAmA A .....



    SuBakaruDu suruciruDu BavaharuDu BagavaMtuDevaDU

    kaLyANa guNagaNuDu karuNA GanAGanuDu evaDU..

    allA tatvamuna allArumuddugA alarAru aMdAla caMdruDevaDU

    AnaMdanaMdanuDu amRutarasacaMdanuDu rAmacaMdruDukAka iMkevvaDU



    tAgarA SrIrAma nAmAmRutaM

    A nAmamE dATiMcu BavasAgaraM

    tAgarA SrIrAma nAmAmRutaM

    A nAmamE dATiMcu BavasAgaraM...



caraNaM 1:

    E mUrti mUDumUrtuluga velasina mUrti

    E mUrti mujjagaMbula mUlamaumUrti

    E mUrti Sakticaitanya mUrtI..

    E mUrti niKilAMDa nityasatyaspUrti

    E mUrti nirvANa nijadharmasamavarti

    E mUrti jagadEka cakravartI...

    E mUrti GanamUrti E mUrti guNakIrti

    E mUrti aDagiMcu janmajanmala Arti

    A mUrti E mUrti yunugAni rasamUrti

    A mUrti SrIrAma caMdramUrtI...



    tAgarA...A..A.. tAgarA SrIrAma nAmAmRutaM

    A nAmamE dATiMcu BavasAgaraM U~M.. U~M.. U~M..



caraNaM 2:

    pA pA pa mapanIpa mapanIpa mapasanipa mA pA mA - SrI rA mA

    pA pA pa mapanIni panisAsa nirisanipa

    mA pA ni ma pa ma - kOdaMDa rAmA

    mapanisarisAni pAnIpAmA - sItArAmA

    mapanisarisAri sarimarisa nipamA - AnaMdarAmA



    mA mA rimarimari sarimA

    rA mA jayarAmA

    sarimA - rAmA

    sapamA - rAmA

    pA......vana nAmA



    E vElpu ellavElpulunu golceDi vElpu

    E vElpu EDEDulOkAlakE vElpu

    E vElpu niTTUrpu ilanu nilpU

    A... A... A...

    E vElpu niKila kaLyANamula kalagalpu

    E vElpu nigamanigamAlanniTini telpu

    E vElpu niMgi nElalanu galpU

    EvElpu dyuti golpu

    E vElpu marugolpu

    E vElpu dEmalpu lEni gelupU

    E vElpu sItamma valaputalapulanElpu

    A vElpu dAsAnudAsulaku kaimODpu



    tAgarA... A.. A.. tAgarA SrIrAma nAmAmRutaM

    A nAmamE dATiMcu BavasAgaraM U~M.. U~M.. U~M..
పల్లవి:

    అల్లా ఆ ఆ ఆ...



    శ్రీరామా ఆ .....



    శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ

    కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ..

    అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ

    ఆనందనందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడుకాక ఇంకెవ్వడూ



    తాగరా శ్రీరామ నామామృతం

    ఆ నామమే దాటించు భవసాగరం

    తాగరా శ్రీరామ నామామృతం

    ఆ నామమే దాటించు భవసాగరం...



చరణం 1:

    ఏ మూర్తి మూడుమూర్తులుగ వెలసిన మూర్తి

    ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌమూర్తి

    ఏ మూర్తి శక్తిచైతన్య మూర్తీ..

    ఏ మూర్తి నిఖిలాండ నిత్యసత్యస్పూర్తి

    ఏ మూర్తి నిర్వాణ నిజధర్మసమవర్తి

    ఏ మూర్తి జగదేక చక్రవర్తీ...

    ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి

    ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి

    ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి

    ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తీ...



    తాగరా...ఆ..ఆ.. తాగరా శ్రీరామ నామామృతం

    ఆ నామమే దాటించు భవసాగరం ఊఁ.. ఊఁ.. ఊఁ..



చరణం 2:

    పా పా ప మపనీప మపనీప మపసనిప మా పా మా - శ్రీ రా మా

    పా పా ప మపనీని పనిసాస నిరిసనిప

    మా పా ని మ ప మ - కోదండ రామా

    మపనిసరిసాని పానీపామా - సీతారామా

    మపనిసరిసారి సరిమరిస నిపమా - ఆనందరామా



    మా మా రిమరిమరి సరిమా

    రా మా జయరామా

    సరిమా - రామా

    సపమా - రామా

    పా......వన నామా



    ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు

    ఏ వేల్పు ఏడేడులోకాలకే వేల్పు

    ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పూ

    ఆ... ఆ... ఆ...

    ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు

    ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు

    ఏ వేల్పు నింగి నేలలను గల్పూ

    ఏవేల్పు ద్యుతి గొల్పు

    ఏ వేల్పు మరుగొల్పు

    ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ

    ఏ వేల్పు సీతమ్మ వలపుతలపులనేల్పు

    ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు



    తాగరా... ఆ.. ఆ.. తాగరా శ్రీరామ నామామృతం

    ఆ నామమే దాటించు భవసాగరం ఊఁ.. ఊఁ.. ఊఁ..

0 comments:

Post a Comment