Friday, July 17, 2020

Sree Ramadasu » Daasaradhee...      శ్రీ రామదాసు » దాశరథీ...

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Daasaradhee... / దాశరథీ...
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sneha / స్నేహ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sri Vedavyasa / శ్రీ వేదవ్యాస  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
pallavi:

    dASarathI... karuNA payOnithi

    nuvvE dikkani nammaDamA

    nI Alayamunu nirmiMcaDamA

    niratamu ninu BajayiMcaDamA

    rAma kOTi raciyiMcaDamA

    sItArAmasvAmI nE cEsina nEramadEmi

    nI daya cUpavadEmi nI darSana mIyavidEmi

    dASarathI karuNA payOnithi



caraNaM 1:

    guhuDu nIku cuTTamA?.. guMDelaku hattukunnAvu

    Sabari nIku tObuTTuvA?... eMgili paLLanu tinnAvu

    nI rAjyamu rAsimmaMTinA?.. nI darSanamE immaMTini kAni

    Ela rAvu?.. nannElarAvu?... nannEla Ela Ela rAvu?

    sItA rAmasvAmI... sItA rAmasvAmI nE cEsina nEramadEmi

    nI daya cUpavadEmi nI darSana mIyavidEmi

    dASarathI karuNA payOnithi



caraNaM 2:

    rAma rasaramya rAma ramaNIya

    rAma raGuvaMSa sOma raNaraMga BIma

    rAkShasa virAma kamanIya dhAma

    sauMdarya sIma nIrajaSyAma nijaBujOktAma

    BOjanalalAma Buvanajaya rAma pAhi BadrAdri rAma pAhI..



caraNaM 3:

    takShaNa rakShaNa viSvavilakShaNa dharma vicakShaNa gOdAri kalisenEmirA

    DAM Da Da DAMDa DAMDa ninadammula

    jAMDamuniMDa mattavEdaMDamu nekkinE pogaDu nI aBayavratamEdirA

    prEma rasAMtaraMga hRudayaMgama

    suMga SuBaMga raMga bahuraMgada

    BaMga tuMga suguNaika taraMga

    susaMga satya sAraMga suSrutivihaMga pApa mRudu saMga viBaMga

    BUtala pataMgA... madhu maMgaLa rUpamE cUpavEmirA

    garuDagamana rArA ... garuDagamana rArA ...
పల్లవి:

    దాశరథీ... కరుణా పయోనిథి

    నువ్వే దిక్కని నమ్మడమా

    నీ ఆలయమును నిర్మించడమా

    నిరతము నిను భజయించడమా

    రామ కోటి రచియించడమా

    సీతారామస్వామీ నే చేసిన నేరమదేమి

    నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి

    దాశరథీ కరుణా పయోనిథి



చరణం 1:

    గుహుడు నీకు చుట్టమా?.. గుండెలకు హత్తుకున్నావు

    శబరి నీకు తోబుట్టువా?... ఎంగిలి పళ్ళను తిన్నావు

    నీ రాజ్యము రాసిమ్మంటినా?.. నీ దర్శనమే ఇమ్మంటిని కాని

    ఏల రావు?.. నన్నేలరావు?... నన్నేల ఏల ఏల రావు?

    సీతా రామస్వామీ... సీతా రామస్వామీ నే చేసిన నేరమదేమి

    నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి

    దాశరథీ కరుణా పయోనిథి



చరణం 2:

    రామ రసరమ్య రామ రమణీయ

    రామ రఘువంశ సోమ రణరంగ భీమ

    రాక్షస విరామ కమనీయ ధామ

    సౌందర్య సీమ నీరజశ్యామ నిజభుజోక్తామ

    భోజనలలామ భువనజయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ..



చరణం 3:

    తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా

    డాం డ డ డాండ డాండ నినదమ్ముల

    జాండమునిండ మత్తవేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా

    ప్రేమ రసాంతరంగ హృదయంగమ

    సుంగ శుభంగ రంగ బహురంగద

    భంగ తుంగ సుగుణైక తరంగ

    సుసంగ సత్య సారంగ సుశ్రుతివిహంగ పాప మృదు సంగ విభంగ

    భూతల పతంగా... మధు మంగళ రూపమే చూపవేమిరా

    గరుడగమన రారా ... గరుడగమన రారా ...

0 comments:

Post a Comment