Song » Adigo Adigo Bhadragiri / అదిగో అదిగో భద్రగిరీ
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: OM .. OM .. OM SrIrAmacaMdraparabrahmaNE namaH ! adigO adigO BadragirI..AMdhrajAtikidi ayOdhyApurI E vAlmIkI rAyani kadhagA..sItArAmulu tanapai odagA rAmadAsakRuta rAmapadAmRuta vAggEyasvara saMpadagA velasina dakShiNa sAkEtapurI adigO adigO BadragirI..AMdhrajAtikidi ayOdhyApurI rAM .. rAM .. rAM .. rAM caraNaM 1: rAmanAma jIvana nirmitruDu punaH darSanamu kOrina BadruDu sItArAmula darSanAnikai GOratapassunu cEsenappuDU tapamunu meccI dharaNiki vaccI darSanamiccenu mahAviShNuvU ! trEtAyugamuna rAmarUpamE trikaraNaSuddiga kOrenu BadruDu AdarSAlaku agrapIThamau A darSanamE kOrenappuDU caraNaM 2: dharaNipatiyE dharaku alluDai.. SaMKacakramulu aTu iTu kAgA.. dhanurbANamulu tanuvai pOgA.. sItAlakShmaNa sahituDai.. koluvu tIre koMDaMta dEvuDU.. SilagA maLLI malacI.. Siramunu nIvE nilacI.. Badragiriga nanu pilicE BAgyamu nimmani kOre BadruDU caraNaM 3: vAmAMkasthita jAnakI parilasa kOdaMDa daMDaM karE cakraM cOrBakarENa bAhu yugaLE SaMKaM SaraM dakShiNE viGrANaM jalajAta patra nayanaM BadrAdri mUrtisthitaM kEyUrAdi viBUShitaM raGupatiM saumitri yuktaM BajE ! adigO adigO BadragirI..AMdhrajAtikidi ayOdhyApurI
పల్లవి: ఓం .. ఓం .. ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః ! అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ ఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురీ అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ రాం .. రాం .. రాం .. రాం చరణం 1: రామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ ! త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ చరణం 2: ధరణిపతియే ధరకు అల్లుడై.. శంఖచక్రములు అటు ఇటు కాగా.. ధనుర్బాణములు తనువై పోగా.. సీతాలక్ష్మణ సహితుడై.. కొలువు తీరె కొండంత దేవుడూ.. శిలగా మళ్ళీ మలచీ.. శిరమును నీవే నిలచీ.. భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ చరణం 3: వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ! అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
0 comments:
Post a Comment