Tuesday, July 21, 2020

Sree Anjaneyam » Tikamaka makatika      శ్రీఆంజనేయం » తికమక మకతిక

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Tikamaka makatika / తికమక మకతిక

Song Details:Actor : Arjun / అర్జున్ ,  Nitin / నితిన్ ,Actress : Charmi / చార్మి ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pa:tikamaka makatika parugulu eTukEsi
naDavarA naDavarA naluguritO kalisi
SrIrAma caMduruNNi kOvellO Kaidu cEsi
rAkAsi rAvaNuNNi guMDellO koluvucEsi
talatikkala BaktitO taitakkala maniShI
taididitai diditai diditai
diditai diditai diditai
diditai diditai didi
tikamaka makatika parugulu eTukEsi
naDavarA naravarA naluguritO kalisI
ca: vetikE majilI dorikE dAkA
kaShTAlu naShTAlu ennoccinA kShaNamaina ninnApunA
kaTTAli nIlOna anvEShaNa
kannITipai vaMtena
beduraMTu lEni madi edurutirigi aDigEnA
badulaMTUlEni praSna lEdu lOkAnA
nI SOkamE SlOkamai palikiMcarA maniShI
tai diditai diditai diditai
didi tikamaka makatika parugulu eTukEsI
naDavarA naDavarA naluguritO kalisI
ca: aDivE ainA kaDalE ainA
dharmAnni naDipiMcu pAdAlakI SirasoMci dArIyadA
aTuvaMTipAdAlu pAdukAkI paTTABiShEkamE kadA
A rAmagAdha nuvu rAsukunnade kAdA
adi nEDu nIku tagu dAri cUpanaMdA
A aDugulajADalu cerapoddurA maniShI
tai didi tarikiTatOM
tattOM tikamaka .... makatika
tikA makA tika tikamaka makatika
parugulu eTukEsi
naravarA naDavarA naluguritO kalasI.....
ప:తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నడవరా నలుగురితో కలిసి
శ్రీరామ చందురుణ్ణి కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువుచేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తైదిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసీ
చ: వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోన అన్వేషణ
కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూలేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ
తై దిదితై దిదితై దిదితై
దిది తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నడవరా నలుగురితో కలిసీ
చ: అడివే ఐనా కడలే ఐనా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటిపాదాలు పాదుకాకీ పట్టాభిషేకమే కదా
ఆ రామగాధ నువు రాసుకున్నదె కాదా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగులజాడలు చెరపొద్దురా మనిషీ
తై దిది తరికిటతోం
తత్తోం తికమక .... మకతిక
తికా మకా తిక తికమక మకతిక
పరుగులు ఎటుకేసి
నరవరా నడవరా నలుగురితో కలసీ.....

0 comments:

Post a Comment