Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Veenaleni teeganu / వీణలేని తీగను

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Others
pallavi :

 veeNalaeni teeganu neevulaeni bratukunu

 mOstoo jeeviMchalaenu mugisiMdani maraNiMchalaenu

IIveeNalaeniII

 jeeviMchalaenu... maraNiMchalaenu...



 charaNaM : 1

 manasu ninnae valachiMdi nannu viDichi veLliMdi

 ninnu marachi rammaMTae veelukaadu pommaMdi

IImanasuII

 maruvalaeni manasukannaa narakamaemuMdi

 aa narakamaMdae bratakamani naa nosaTa nuvvae raasiMdi

 IIveeNalaeniII



 charaNaM : 2

 veeNakaemi teega tegitae maarchukuMTuMdi

 tegina teegaku veeNa ekkaDa dorakabOtuMdi

 teega maarinaa kotta raagaM palakanaMTuMdi

 paata smRtulae maasipOka baadhapaDutuMdi

 jeeviMchalaenu... maraNiMchalaenu...



 charaNaM : 3

 baMgabaarina guMDe naadipagilipOdu chediripOdu

 nuvvu paerchina praema chitilO kaalipOdu boodikaadu

 ninnu kalisae aaSalaedu

 nijaM telisae daarilaedu

 chivariki nee jeevitaaniki chiTikeDaMta vishaM laedu

 jeeviMchalaenu... maraNiMchalaenu...


 
 
Click here to hear the song
పల్లవి :

 వీణలేని తీగను నీవులేని బ్రతుకును

 మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను

 ॥వీణలేని॥

 జీవించలేను... మరణించలేను...

 చరణం : 1

 మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది

 నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది

 ॥మనసు॥

 మరువలేని మనసుకన్నా నరకమేముంది

 ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది

 ॥వీణలేని॥



 చరణం : 2

 వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది

 తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది

 తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది

 పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది

 జీవించలేను... మరణించలేను...



 చరణం : 3

 బంగబారిన గుండె నాదిపగిలిపోదు చెదిరిపోదు

 నువ్వు పేర్చిన ప్రేమ చితిలో కాలిపోదు బూదికాదు

 నిన్ను కలిసే ఆశలేదు

 నిజం తెలిసే దారిలేదు

 చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు

 జీవించలేను... మరణించలేను...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment