Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Vaduka marachedavela / వాడుక మరచెదవేల

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : A.M. Raja / ఏ.యమ్. రాజా ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 vaaDuka marachedavaela

 nanu vaeDuka chaesedavaela

 ninu chooDani dinamu naakoka yugamu

 neeku telusunu nijamu... (2)

 vaaDuka maruvanu naenu

 ninu vaeDuka chaeyagalaenu

 ninu chooDani kshaNamu naakoka dinamu

 neeku telusunu nijamu... (2)
 charaNaM : 1

 saMjaraMgula challani gaalula

 madhura raagamu maMjula gaanamu

IIsaMjaraMgulaII

 taene viMdula teeyani kalaloo marichipOyina vaeLa

 ika manakee manugaDa aela

 nee aMdamu choopi DeMdamu oopi

 aaSa raepedavaelaa aaSa raepedavaelaa

 O O O... saMjaraMgula saaginaa challagaalulu aaginaa

IIsaMjaraMgulaII

 kalasi melasina kannulalOna... (2)

 manasu chooDagalaevaa...

 marulu tODagalaevaa...

IIvaaDuka maruvanuII
 charaNaM : 2

 kannulaa ivi kalala vennelaa

 chinne vannela chilipi tennulaa

IIkannulaaII

 manasu telisee marmamaelaa

 iMta toMdara aelaa

 iTu paMtaalaaDuTa maelaa

 naakaMdarikannaa aaSalu unnaa

 haddu kaadanagalanaa haddu kaadanagalanaa

 vaaDani navvulatODa

 naDayaaDeDu puvvula jaaDa

 anuraagamu virisi lOkamu marachi

 aekamaudamu kalasi aekamaudamu kalasi
పల్లవి :

 వాడుక మరచెదవేల

 నను వేడుక చేసెదవేల

 నిను చూడని దినము నాకొక యుగము

 నీకు తెలుసును నిజము... (2)

 వాడుక మరువను నేను

 నిను వేడుక చేయగలేను

 నిను చూడని క్షణము నాకొక దినము

 నీకు తెలుసును నిజము... (2)
 చరణం : 1

 సంజరంగుల చల్లని గాలుల

 మధుర రాగము మంజుల గానము

 ॥సంజరంగుల॥

 తేనె విందుల తీయని కలలూ మరిచిపోయిన వేళ

 ఇక మనకీ మనుగడ ఏల

 నీ అందము చూపి డెందము ఊపి

 ఆశ రేపెదవేలా ఆశ రేపెదవేలా

 ఓ ఓ ఓ... సంజరంగుల సాగినా చల్లగాలులు ఆగినా

 ॥సంజరంగుల॥

 కలసి మెలసిన కన్నులలోన... (2)

 మనసు చూడగలేవా...

 మరులు తోడగలేవా...

 ॥వాడుక మరువను॥
 చరణం : 2

 కన్నులా ఇవి కలల వెన్నెలా

 చిన్నె వన్నెల చిలిపి తెన్నులా

 ॥కన్నులా॥

 మనసు తెలిసీ మర్మమేలా

 ఇంత తొందర ఏలా

 ఇటు పంతాలాడుట మేలా

 నాకందరికన్నా ఆశలు ఉన్నా

 హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా

 వాడని నవ్వులతోడ

 నడయాడెడు పువ్వుల జాడ

 అనురాగము విరిసి లోకము మరచి

 ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి

0 comments:

Post a Comment