Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Unte ee voollo vundu / ఉంటే యీ వూళ్ళో వుండు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Folk Songs
uMTE yI vULLO vuMDu

pOtE mI dESaM pOrA

cuTTupakkala vunnAvaMTE

cUDakuMDA prANaM vuMDadurA...    //uMTE//

kUlikeLtE nAkE rArA cEnu vunnAdi

kUDu tiMTE nAtO tinarA tODu vuMTAdI

iMkEDakainA ellAvaMTE

nAdi cuppanAti manasu adi nIku telusu

oppi vUrukOnaMTadi... //uMTE//

Uri niMDA vayasu pillalu _ oMTigunnAru

vATamaina vANNi cUstE _ vadalanaMTAru

nI capalabuddi sUpAvaMTE

maniShi nAku dakka viMka maMcidAnni kAnu Anaka... //uMTE//

pagaTi pUTa panilO paDitE _ palakanaMTAvu

rAtirELa ragasseMga rAnu jaDisEvu

nE tellavArlu mElukuMTE...

errabaDDa kaLLucUsi

EmEmo anukuni Idi kuLLukuMTadi... //uMTE//
ఉంటే యీ వూళ్ళో వుండు

పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల వున్నావంటే

చూడకుండా ప్రాణం వుండదురా...    //ఉంటే//

కూలికెళ్తే నాకే రారా చేను వున్నాది

కూడు తింటే నాతో తినరా తోడు వుంటాదీ

ఇంకేడకైనా ఎల్లావంటే

నాది చుప్పనాతి మనసు అది నీకు తెలుసు

ఒప్పి వూరుకోనంటది... //ఉంటే//

ఊరి నిండా వయసు పిల్లలు _ ఒంటిగున్నారు

వాటమైన వాణ్ణి చూస్తే _ వదలనంటారు

నీ చపలబుద్ది సూపావంటే

మనిషి నాకు దక్క వింక మంచిదాన్ని కాను ఆనక... //ఉంటే//

పగటి పూట పనిలో పడితే _ పలకనంటావు

రాతిరేళ రగస్సెంగ రాను జడిసేవు

నే తెల్లవార్లు మేలుకుంటే...

ఎర్రబడ్డ కళ్ళుచూసి

ఏమేమొ అనుకుని ఈది కుళ్ళుకుంటది... //ఉంటే//

0 comments:

Post a Comment