Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Tellacheera Kattukunnadi / తెల్లచీర కట్టుకున్నది

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Bhanumathi / భానుమతి  ,  Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 tellacheera kaTTukunnadi evarikOsamu

 mallepoolu peTTukunnadi evarikOsamu

IItellacheeraII

 tellacheera kaTTinaa mallepoolu peTTinaa

 kallakapaTamerugani manasu kOsamu

 manasulOni challani mamata kOsamu

 IItellacheeraII



 charaNaM : 1

 daachukunna mamatalanni evari kOsamu

 daaparikaM erugani manishi kOsamu

IIdaachukunnaII

 daaganee yavvanaM evari kOsamu

 daachukoni aelukunae priyuni kOsamu

 IItellacheeraII



 charaNaM : 2

 poddaMta kalavariMta evari kOsamu

 nidduraina raaneeni nee kOsamu

IIpoddaMtaII

addaala chekkiLLu evari kOsamu

 muddaina nee mOvi mudra kOsamu

 IItellacheeraII



 charaNaM : 3

 niMgi naela kalasinadi evarikOsamu

 neevu nannu chaeradeesinaMdukOsamu

IIniMgiII

 naela meeda okkarai saagipOdamu

 niMgilOna chukkalai nilichipOdamu

 IItellacheeraII




 
Click here to hear the song
పల్లవి :

 తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసము

 మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము

 ॥తెల్లచీర॥

 తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా

 కల్లకపటమెరుగని మనసు కోసము

 మనసులోని చల్లని మమత కోసము

 ॥తెల్లచీర॥



 చరణం : 1

 దాచుకున్న మమతలన్ని ఎవరి కోసము

 దాపరికం ఎరుగని మనిషి కోసము

 ॥ దాచుకున్న॥

 దాగనీ యవ్వనం ఎవరి కోసము

 దాచుకొని ఏలుకునే ప్రియుని కోసము

 ॥తెల్లచీర॥



 చరణం : 2

 పొద్దంత కలవరింత ఎవరి కోసము

 నిద్దురైన రానీని నీ కోసము

 ॥ పొద్దంత॥

అద్దాల చెక్కిళ్ళు ఎవరి కోసము

 ముద్దైన నీ మోవి ముద్ర కోసము

 ॥తెల్లచీర॥



 చరణం : 3

 నింగి నేల కలసినది ఎవరికోసము

 నీవు నన్ను చేరదీసినందుకోసము

 ॥ నింగి॥

 నేల మీద ఒక్కరై సాగిపోదము

 నింగిలోన చుక్కలై నిలిచిపోదము

 ॥తెల్లచీర॥




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment