Song » Talachinade Jariginadaa / తలచినదే జరిగినదా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
pallavi : talachinadae jariginadaa daivaM eMdulaku jariginadae talachitivaa SaaMti laedu neeku talachinadae jariginadaa daivaM eMdulaku jariginadae talachitivaa SaaMti laedu neeku mugisina gaatha modaliDadudaevuni rachanalalO modaliDu gaatha mugisaedepuDO manujula bratukulalO talachinadae jariginadaa daivaM eMdulaku jariginadae talachitivaa SaaMti laedu neeku charaNaM : 1 manasunakennO maargaalu kanulaku ennO svapnaalu evarostaarO evaruMTaarO aemaunO mana kalalu manasunakennO maargaalu kanulaku ennO svapnaalu evarostaarO evaruMTaarO aemaunO mana kalalu edalO okarae kudirinanaaDu manasae oka svargaM okaruMDagaa vaerokarochchaaraa lOkaM oka narakaM talachinadae jariginadaa daivaM eMdulaku jariginadae talachitivaa SaaMti laedu neeku charaNaM : 2 praema pavitraM peLli pavitraM edi nijamau baMdhaM edi anuraagaM edi aanaMdaM bratukunakaedee gamyaM maMchi cheDu maaraedae manadannadi maaTaedae idi sahajaM idi satyaM eMdulakee khaedaM talachinadae jariginadaa daivaM eMdulaku jariginadae talachitivaa SaaMti laedu neeku Click here to hear the song
పల్లవి : తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ముగిసిన గాథ మొదలిడదుదేవుని రచనలలో మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు చరణం : 1 మనసునకెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు మనసునకెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు చరణం : 2 ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం ఎది నిజమౌ బంధం ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకునకేదీ గమ్యం మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment