Song » Silala pai silpaalu chekkinaaru / శిలలపై శిల్పాలు చెక్కినారు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Shavukaru Janaki / షావుకారు జానకి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
aho! andhra bhoja ! sri krishna devaraaya vijaya nagara saamrajya nirmaana tejo viraajaa !! Ee sidhilaalalo chiranjeevivainaavayaa ! silalapai silpaalu chekkinaaru silalapai silpaalu chekkinaaru- manavaallu srushtike andaalu techhinaaru ||silalapai || kanuchoopu karuvaina vaarikainaa kanipinchi kanuvindu kaliginchu reethigaa ||silalapai || oka vaipu vurootha loopu kavanaalu okaprakka vurikinchu yudda bhereelu Oka chempa Srungaara moluku naatyaalu navarasaalolikinchu nagaraanikochhaamu kanulu levani neevu kalatha paDavaladu Naa kanulu neevigaa chesukuni choodu ||silalapai || Eka sila radhamupai - lokesu Odilona Ora choopula devi ooregi raaga Raati shambhaalake chetanatvam kaligi sarigamaa pa da ni sa swaramule paadaka Kongunudi vesukuni krotta dampathulu koduku puttaalanee koruthunnaaranee ||silalapai|| Rajule poyinaa - Raajyaale koolina kaalaalu maarinaa - gaadpule veechinaa manusule dhanujulai matti paaljesina chedaranee kadalani silpaala valene Neevu naa hrudayaana nityamai satyamai nhilichi vundunu chelee nijamu naa jaabilee ! Click here to hear the song
సాకి: అహో! ఆంధ్ర భోజా ! శ్రీ కృష్ణ దేవరాయా విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!! ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా! శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు - మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు || శిలలపై || కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా || శిలలపై || ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒకచెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలోలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకుని చూడు ||శిలలపై|| ఏక శిల రధముపై - లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరుతున్నారనీ ||శిలలపై|| రాజులే పోయినా - రాజ్యాలు కూలినా కాలాలు మారినా - గాడ్పులే వీచినా మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా చెదరనీ కదలనీ శిల్పాల వలెనే నీవు నా హౄదయాన నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలీ నిజము నా జాబిలీ ! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment