Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Sigaloki virulichi / సిగలోకి విరులిచ్చి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
viSvaM:  sigalOki virulicci 
celinosaTa tilakamiDi
sigapUvu vADakanE
celibratuku vADenayyA
paruvAniki balavaMtAna
paggAlE vEstAvA
manasumUsi mamatalu rOsi
manugaDa masi cEstAvA
tanuvu cikki SalyaMbainA
valapulaNigi pOyEnA
iravailO aravai vayasu
evarikaina vaccEnA
evarikainA vaccEnA          ||siga||
tIyanaina jIvitAna 
cEduviShaMtAgEvA
tODunIDagA okaruMDi
EkAkiga bratikEvA
kOrinadi cEtikicikki
Arutunnadoka dIpaM
kOrinadicEtikirAka
Arakunnadoka tApaM
Arukunnadoka tApaM         ||siga||
aMdhuni eduTa aMdAlElA
aDavini punnami vennelalElA
asamardhuna kavakASAlElA
vRudhA... vRudhA... I bratuku vRudhA....
విశ్వం:  సిగలోకి విరులిచ్చి 
చెలినొసట తిలకమిడి
సిగపూవు వాడకనే
చెలిబ్రతుకు వాడెనయ్యా
పరువానికి బలవంతాన
పగ్గాలే వేస్తావా
మనసుమూసి మమతలు రోసి
మనుగడ మసి చేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా
వలపులణిగి పోయేనా
ఇరవైలో అరవై వయసు
ఎవరికైన వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా          ||సిగ||
తీయనైన జీవితాన 
చేదువిషంతాగేవా
తోడునీడగా ఒకరుండి
ఏకాకిగ బ్రతికేవా
కోరినది చేతికిచిక్కి
ఆరుతున్నదొక దీపం
కోరినదిచేతికిరాక
ఆరకున్నదొక తాపం
ఆరుకున్నదొక తాపం         ||సిగ||
అంధుని ఎదుట అందాలేలా
అడవిని పున్నమి వెన్నెలలేలా
అసమర్ధున కవకాశాలేలా
వృధా... వృధా... ఈ బ్రతుకు వృధా....

0 comments:

Post a Comment