Song » Repanti Rupam / రేపంటి రూపం
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :Music Director :
Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
rEpaMTi rUpaM kaMTi.. pUviMTi cUpula vaMTi.. nI kaMTi cUpula veMTaa naa parugaMTi rEpaMTi velugE kaMTi.. pUviMTi doranE kaMTi.. nI kaMTi kaLalu kalalu nI sommaMTi naa tODu nIvai uMTE nI nIDa nEnEnaMTi.. I jaMTa kaMTE vErE lEdu lEdaMTi.. naa tODu nIvai uMTE nI nIDa nEnEnaMTi.. I jaMTa kaMTE vErE lEdu lEdaMTi.. nI paina aashalu uMci..aa paina kOTalu peMci nI paina aashalu uMci..aa paina kOTalu peMci nI kOsaM rEpU maapU uMTini ninnaMTi rEpaMTi rUpaM kaMTi.. pUviMTi cUpula vaMTi.. nI kaMTi cUpula veMTaa naa parugaMTi nE malle puvvai virisi nI nallani jaDalO velasi.. nI callani navvula kalasi uMTE caalaMTi nE malle puvvai virisi nI nallani jaDalO velasi.. nI callani navvula kalasi uMTE caalaMTi nI kaali muvvala ravaLi naa bhaavi mOhana muraLi nI kaali muvvala ravaLi naa bhaavi mOhana muraLi I raaga saraLi tarali pOdaaM rammaMTi rEpaMTi velugE kaMTi.. pUviMTi doranE kaMTi.. nI kaMTi kaLalu kalalu nI sommaMTi nIlOni magasiri tOTI naalOni sogasula pOTi.. vEyiMci nEnE ODi pOnI pommaMTi.. nEnODi nIvE gelici..nI gelupu naadani talaci nEnODi nIvE gelici..nI gelupu naadani talaci raagaalu raMjillu rOjE raajI rammaMTi rEpaMTi velugE kaMTi.. pUviMTi doranE kaMTi.. nI kaMTi kaLalu kalalu nI sommaMTi rEpaMTi rUpaM kaMTi.. pUviMTi cUpula vaMTi.. nI kaMTi cUpula veMTaa naa parugaMTi Click here to hear the song
రేపంటి రూపం కంటి.. పూవింటి చూపుల వంటి.. నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి.. నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనేనంటి.. ఈ జంట కంటే వేరే లేదు లేదంటి.. నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనేనంటి.. ఈ జంట కంటే వేరే లేదు లేదంటి.. నీ పైన ఆశలు ఉంచి..ఆ పైన కోటలు పెంచి నీ పైన ఆశలు ఉంచి..ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపూ మాపూ ఉంటిని నిన్నంటి రేపంటి రూపం కంటి.. పూవింటి చూపుల వంటి.. నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి.. నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి.. నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి ఈ రాగ సరళి తరలి పోదాం రమ్మంటి రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి.. నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి నీలోని మగసిరి తోటీ నాలోని సొగసుల పోటి.. వేయించి నేనే ఓడి పోనీ పొమ్మంటి.. నేనోడి నీవే గెలిచి..నీ గెలుపు నాదని తలచి నేనోడి నీవే గెలిచి..నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి.. నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి రేపంటి రూపం కంటి.. పూవింటి చూపుల వంటి.. నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment