Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Rallallo Isakallo / రాళ్ళల్లో ఇసకల్లో

Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Rajani / రజని ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
laa..laa..lalalaala laalaala..lalalalaa

laa laa laa .. lalalaala..laalalaalalaa..



UhUhu..aahaahaa OhOhO..

laalaalaa..aahaahaa OhOhO..



raaLLallO isakallO raashaamu iddari pErlu..

kaLLu mUsi cinnagaa kalipi caduvukO..

okkasaari..kalalOna tiyyaagaa gurutu teccukO..



raaLLallO isakallO raashaamu iddari pErlu..

kaLLu mUsi cinnagaa kalipi caduvukO..

okkasaari..kalalOna tiyyaagaa gurutu teccukO..



kalalannI paMTalai paMDEnEmO?? kalisiMdi kannula paMDagEmO??

cinanaaTi snEhamE aMdamEmO..adi nETi anuraaga baMdhamEmO..



tolakari valapulalO..pulakiMcu hRudayaalalO..

tolakari valapulalO..pulakiMcu hRudayaalalO..

ennaaLLaakInaaDu vinnaamu sannaayi mELaalu??



aa mELa taaLaalu mana peLLi maMtraalai vinipiMcu vELalO..

ennenni bhaavaalO..



raaLLallO isakallO raashaamu iddari pErlu..

kaLLu mUsi cinnagaa kalipi caduvukO..

okkasaari..kalalOna tiyyaagaa gurutu teccukO..



cUshaanu ennaDO parikiNIlO..vaccaayi kottagaa sogasulEvO..

hRudayaana daacina poMgulEvO..paruvaana pUcenu vannelEvO!!



vannela vaanallO..vanaraina jalakaalalO..

vannela vaanallO..vanaraina jalakaalalO..

munagaali tElaali taDavaali aaraali mOhaMlO!!



aa mOhadaahaalu mana kaMTi paapallO kanipiMcu gOmulO..

ennenni kaugiLLO..



raaLLallO isakallO raashaamu iddari pErlu..

kaLLu mUsi cinnagaa kalipi caduvukO..

okkasaari..kalalOna tiyyaagaa gurutu teccukO..



laalalaala laalalaa..laalalaalalaa

laalalaala laalalaa..laalalaalalaa!!
లా..లా..లలలాల లాలాల..లలలలా

లా లా లా .. లలలాల..లాలలాలలా..



ఊహూహు..ఆహాహా ఓహోహో..

లాలాలా..ఆహాహా ఓహోహో..



రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..

ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..



రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..

ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..



కలలన్నీ పంటలై పండేనేమో?? కలిసింది కన్నుల పండగేమో??

చిననాటి స్నేహమే అందమేమో..అది నేటి అనురాగ బంధమేమో..



తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో..

తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో..

ఎన్నాళ్ళాకీనాడు విన్నాము సన్నాయి మేళాలు??



ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో..

ఎన్నెన్ని భావాలో..



రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..

ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..



చూశాను ఎన్నడో పరికిణీలో..వచ్చాయి కొత్తగా సొగసులేవో..

హృదయాన దాచిన పొంగులేవో..పరువాన పూచెను వన్నెలేవో!!



వన్నెల వానల్లో..వనరైన జలకాలలో..

వన్నెల వానల్లో..వనరైన జలకాలలో..

మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో!!



ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో..

ఎన్నెన్ని కౌగిళ్ళో..



రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..

ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..



లాలలాల లాలలా..లాలలాలలా

లాలలాల లాలలా..లాలలాలలా!!

0 comments:

Post a Comment