Song » Purushudu nanai puttali / పురుషుడు నేనై పుట్టాలి
Song Details:Actor :
Krishna / కృష్ణ ,
Rammohan / రామ్మోహన్ ,Actress :
Sukanya / సుకన్య ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
chittibaabu : purushudu nenai puttaali prakruthi neevai raavaali iruvuri manasulu kalavaali - aa kalayika kala kala laadaali ||puru|| bhaanu : puDa me nenai puttaali - odidudukulanu orvaali kaDalini nadinee kalapaali- aa kalayika kala kala laadaali ||pudami|| chittibaabu : merameralaaDe vayasu nenai misamisalaade sogasu neevai velluvalaaga vennela laagaa mullokaalanu munchaali ||puru|| bhaanu: pai merugulake paravaSamayye - paruvaaniki paggam vesi paggam pattina kanne manasulo lothulu telisee masalaali ||pudami|| basavaraaju : devudu nenai puttaali - denno taanu preminchi aadadaani manasantene - vishamani telisee eDwaali ||devudu|| gaaju vanti hrudayam tanadi - raati vanti naatiki tagili mukkalu chekkalugaa pagili - netturu kanneeravvaali ||devudu||
చిట్టిబాబు : పురుషుడు నేనై పుట్టాలి ప్రకృతి నీవై రావాలి ఇరువురి మనసులు కలవాలి - ఆ కలయిక కళ కళ లాడాలి ||పురు|| భాను : పుడ మే నేనై పుట్టాలి - ఒడిదుడుకులను ఓర్వాలి కడలిని నదినీ కలపాలి- ఆ కలయిక కళ కళ లాడాలి ||పుడమి|| చిట్టిబాబు : మేరమెరలాడే వయసు నేనై మీసమీసలాడే సొగసు నీవై వెల్లువలాగా వెన్నెల లాగా ముల్లొకాలను ముంచాలి ||పురు|| భాను: పై మెరుగులకే పరవశమయ్యె - పరువానికి పగ్గం వేసి పగ్గం పట్టిన కన్నె మనసులో లోతులు తెలిసీ మసలాలి ||పుడమి|| బసవరాజు : దేవుడు నేనై పుట్టాలి - దేన్నో తాను ప్రేమించి ఆడదాని మనసంటేనే - విషమని తెలిసీ ఏడ్వాలి ||దేవుడు|| గాజు వంటి హృదయం తనది - రాతి వంటి నాతికి తగిలి ముక్కలు చెక్కలుగా పగిలి - నెత్తురు కన్నీరవ్వాలి ||దేవుడు||
0 comments:
Post a Comment