Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Parugulu Theese / పరుగులు తీసే

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
parugulu tIsE nI vayasunaku paggaM vEsenu naa manasu

urakalu vEsE naa manasunaku usigolipenulE nI sogasu ahaahaha

Oyani pilicE naa pilupunaku  Oyani palikenu nI valapu

OhOyani palikenu nI valapu

Oyani palikenu nI valapunaku tIyagaa maarenu naa talapu

tiyyatIyagaa maarenu naa talapu ohohoho hohoho

parugulu tIsE nI vayasunaku paggaM vEsenu naa manasu

toNakani beNakani nI biguvulatO dObUcaaDenu naa nagavu

aahaa dObUcaaDenu naa nagavu

dObUcaaDE naa nagavulalO  dOraga paMDenu nI marulu

dOradOraga paMDenu nI marulu ohohoho hohoho

parugulu tIsE nI vayasunaku paggaM vEsenu naa manasu

lEdanipiMcE nI naDumu ahaha naadanipiMcenu I kShaNamu oho

lEdanipiMcE nI naDumu naadanipiMcenu I kShaNamu 

uMdO lEdO I jagamu 

uMduvu nIvu naalO sagamu

idi nijamu kaadanumu

parugulu tIsE nI vayasunaku paggaM vEsenu naa manasu

urakalu vEsE naa manasunaku usigolipenulE nI sogasu ahaahaha

parugulu tIsE nI vayasunaku paggaM vEsenu naa manasu
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ

ఓయని పిలిచే నా పిలుపునకు  ఓయని పలికెను నీ వలపు

ఓహోయని పలికెను నీ వలపు

ఓయని పలికెను నీ వలపునకు తీయగా మారెను నా తలపు

తియ్యతీయగా మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు

ఆహా దోబూచాడెను నా నగవు

దోబూచాడే నా నగవులలో  దోరగ పండెను నీ మరులు

దోరదోరగ పండెను నీ మరులు ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

లేదనిపించే నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ

లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము 

ఉందో లేదో ఈ జగము 

ఉందువు నీవు నాలో సగము

ఇది నిజము కాదనుము

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

0 comments:

Post a Comment